పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి : సతీష్ కుమార్
ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమికొట్టడం లో భాగంగా లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో నిర్విరామంగా సేవాభావంతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సేవలు నిరుపమానమని కన్యకాపరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు పెనుగొండ వెంకట చంద్రశేఖర్ అన్నారు.
విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో గల ఘోషా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మరియు పేషెంట్ల సహాయకులకు మరియు ఆ ప్రాంతంలో గల నిరాశ్రయులకు సుమారు 150 మందికి మధ్యాహ్నం భోజనం, సాంబారు అన్నం, పెరుగన్నం అందించినట్లు తెలిపారు. గత వారం రోజుల నుంచి ప్రతీరోజు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని మరియు లాక్ డౌన్ వున్నంతవరుకు ప్రతీరోజు మధ్యాహ్నం భోజనం కన్యకాపరమేశ్వరి దేవాలయ సంఘ సభ్యులు అందించిన విరాళాలతో అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీయుతులు వి. వి. వి. సత్యనారాయణ మూర్తి, పేకేటి కామేష్, కందుల మధుబాబు, కె ఎం వి ఎస్ టి రామకృష్ణ, జీవిఆర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment