Followers

ముస్లిం సోదరులు, సోదరీమణులు తోడ్పాటు అందించాలి


 నగర పరిధిలో కరోనా నియంత్రణకు


ముస్లిం సోదరులు, సోదరీమణులు తోడ్పాటు అందించాలి


- జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన


విశాఖపట్నం, పెన్ పవర్ 


 


పవిత్ర రంజాన్ మాసం ఆగమనం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సమాజం ఉపవాసాలతో, ప్రార్ధనలతో అత్యంత నిష్ఠగా వ్యవహరిస్తుందనే వాస్తవం అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచ మానవాళి ముంగిట పెను ముప్పుగా దాపురించిన కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, అందులో భాగంగా మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల దృష్ట్యా ముస్లిం సోదరులు తరావీహ్ తదితర ప్రార్ధనలు, ఇఫ్తార్ తమతమ ఇళ్ళలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇమామ్, మువణ్ణన్, ఇద్దరు ముగ్గురు నిర్వాహకులకు మించి మసీదులో వుండరాదు. సహరీ, ఇఫ్తార్ వేళల ప్రకటనలు, అయిదు పూటల అజాన్ కోసం మాత్రమే మైక్ వాడాలి. జకాత్, ఫిత్రా వంటి దానధర్మాలు కూడా లబ్దిదారుల ఇళ్ళకే పంపించే ఏర్పాట్లు చేసుకోవటం మరింత శ్రేయస్కరం. ముస్లిం ధార్మిక గురువుల ఆదేశం కూడా ఇదే. కరోనా వైరస్ నుంచి మానవాళిని పరిరక్షించేందుకు జరుగుతున్న ఈ కృషిలో మీ సహాయ సహకారాలు అవసరం. నా విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వానికీ, పరిపాలనా యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...