విజయనగరం రైల్వే స్టేషన్ లో కోవిడ్ ఐసోలేషన్ కోచ్..
కోవిడ్ ఐసోలేషన్ బోగీ..
విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్
కరోనా వైరస్(కోవిడ్-19) రోజు రోజుకు విస్తరిస్తూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా పాజిటివ్ కేస్ లు పెరిగిన పక్షంలో పరిస్థితి చేయి దాటుతుందని ముందే అంచనా వేసిన ప్రభుత్వం రైల్వే కోచ్ లని ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ కోచ్ లుగా తీర్చిదిద్దింది. విజయనగరం రైల్వేస్టేషన్లో కూడా ఒకటో నెంబర్ ప్లాట్ పాం పై ఒక ట్రైన్ లో రైల్వే అధికారులు కోవిడ్ ఐసోలేషన్ కోచ్ లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి వీటిని డెమో లుగా అధికారులు పేర్కొంటున్నప్పటికీ అత్యవసర సమయంలో వీటికే మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించి ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తెనున్నట్టు చెబుతున్నారు.
No comments:
Post a Comment