అల్పా స్కాన్ లో ఏం జరిగింది..?
పరీక్షల కోసం వచ్చిన రోగి మృతి..
కరోనా లక్షణాలు అంటూ ప్రచారం..
ప్రభుత్వ యంత్రాంగంకి ఇవ్వని సమాచారం..
గుట్టుగా తిరిగి ఆటోలో పంపివేసిన వైనం..
సమాచారం తెలుసుకున్న పోలీసులు..
డాక్టర్ పెద్ది నాయుడు హాస్పిటల్ నుంచి రిఫరైన..
చింతల వలసకు చెందిన వాసిగా గుర్తింపు..
కేన్సర్ తో మృతి చెందినట్టు విచారణలో వెల్లడి..
విజయనగరం,
కరోనా మహమ్మారి విజృంభన చూసి యావత్ ప్రపంచం గజ గజ వణికి పోతోంది. దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేస్ ల సంఖ్యను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తల్లడిల్లుతున్నాయి. కానీ విజయనగరంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొంతమంది వైద్యులు, వారిపైన ఆధార పడి నడుపుతున్న డయాగ్నోసిస్ కేంద్రాల నిర్వాహకులు కనీస బాధ్యతను విస్మరించి వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోంది. విజయనగరంలో బుధ వారం చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..!
కోట కూడలి వద్ద ఉన్న అల్పా స్కాన్ అనే డయాగ్నోసిస్ కేంద్రం కి అత్యంత సీరియస్ పరిస్థితుల్లో పరీక్షల నిమిత్తం వచ్చిన ఒక రోగి మృతి చెందినట్టు బయటకు పొక్కింది. పరీక్షలు చేస్తుండగా పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందినట్టు సమాచారం. అత్యవసర సేవల కోసం హాస్పిటల్ కి వెళ్ళాసిన రోగి పరీక్షల కోసం తమ వద్దకు రావడం, అక్కడే చనిపోయినట్టు బయటకు పొక్కితే తమకి ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అల్పా స్కాన్ కేంద్రం యజమాని వెంటనే వారిని అక్కడ నుంచి పంపివేశారు. దీంతో రోగి బంధువులు ఆటోలో తీసుకొని పోయారు. పరీక్షలకు వచ్చిన వ్యక్తి మృతి చెందడం పట్ల ఆందోళన చెందిన అక్కడే ఉన్న మిగిలిన రోగులు ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది. అలా పోలీసులకి సమాచారం చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ లు అల్పా స్కాన్ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే అప్పటికే ఈ సమాచారం పోలీస్ లకి చేరిపోయిందని తెలిసిన అల్పా యజమాని తన వైపు ఏ తప్పు జరగలేదని చెప్పుకునేందుకు వీలుగా అందుకు ప్రణాళిక ముందే సిద్ధం చేసుకున్నారు. ఏ రోగైతే చనిపోయారన్న ప్రచారం జరిగిందో వారి వివరాలతో కూడిన పరీక్షల రిపోర్ట్ ను తమ వద్దకు వచ్చిన కానిస్టేబుల్ కి ఇచ్చి పంపించేశారు. తమ వద్దకు పరీక్షల నిమిత్తం వచ్చినది సూర్య కాంతం అనే 55 ఏళ్ల కేన్సర్ రోగి అని, ఆమెను గజపతినగరం నుంచి డాక్టర్ పెద్ది నాయుడు రిఫర్ చేసారని అల్పా స్కాన్ నిర్వాహకుడు చెప్పుకొచ్చాడు. కేన్సర్ వల్ల ఆమె పరిస్థితి విషమించడంతో పరీక్షల అనంతరం తిరిగి పంపేసినట్టు తెలిపాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆల్ఫా స్కాన్ నిర్వాహకులు ప్రభుత్వ యంత్రాంగంకి ప్రాధమిక సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడంలో వారి బాధ్యతా రాహిత్యం కనిపిస్తోంది. మరో వైపు క్రిటికల్ కండీషన్ లో ఉన్న రోగులను ప్రభుత్వ హాస్పిటల్స్ కి పంపించాలన్న ప్రభుత్వ ఆదేశాలను భేఖాతారు చేస్తూ డాక్టర్ పెద్ది నాయుడు వంటి ప్రయివేటు వైద్యులు రోగులను పరీక్షల కోసం తరచుగా ఆల్పా వంటి డయాగ్నోసిస్ కేంద్రాలకి పంపుతున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న పరోస్తితుల్లో ప్రయివేట్ వైద్యులు, డయాగ్నోసిస్ కేంద్రాల నిర్వాహకులు ప్రజారోగ్యం దృష్ట్యా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బుధవారం మృతి చెందిన రోగి సూర్య కాంతం చిరునామా కనుక్కోవడానికి జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా శ్రమించింది. ఆమె కేన్సర్ తో మృతి చెందినట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. గజపతినగరం ఎస్సై సన్యాసి నాయుడు మృతురాలి స్వగ్రామం మెంటాడ మండలం చింతల వలస అని తెలుసుకొని అక్కడకి వెళ్లి విచారణ చేపట్టారు. ఆమె కేన్సర్ రోగి అని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నట్టు గుర్తించారు. అనారోగ్యంతో చనిపోయిన వారి వివరాలు తెలుసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆస్కారం వుంటుందని అందులో భాగంగా విచారణ జరిపినట్టు ఎస్సై తెలిపారు. ఈ ఘటన పై జిల్లా వైద్యారోగ్య శాఖాధి కారిణి రమణ కుమారి స్పందిస్తూ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్లో అపోహలకు తావివ్వకుండా ప్రయివేట్ వైద్యులు, డయాగ్నోసిస్ కేంద్రాల నిర్వహకులు బాధ్యతగా వ్యవహరించాలి. తమ వద్దకు వచ్చే క్రిటికల్ కండీషన్ రోగుల సమాచారాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ వారికి అందించాలి. అనుమానితులు ఉంటే వారిని క్వరంటైన్ చేయడానికి, కరోనా పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అష్కారం ఉంటుందన్నారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని ఆమె పేర్కొన్నారు.
No comments:
Post a Comment