Followers

రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కోవిడ్ రక్షణ పరికరాలు


రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కోవిడ్ రక్షణ పరికరాలు


పంపిణీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్


విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి 


 


జిల్లా యంత్రాంగం చేపడుతున్న కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొనే ప్రభుత్వ అద్దె వాహనాల డ్రైవర్లకు కరోనా నుండి రక్షణ కోసం అవసరమైన పరికరాలు, సామాగ్రితో రూపొందించిన ఒక కిట్ ను రవాణా శాఖ ఉచితంగా అందజేస్తోంది. జిల్లాలో 600 వాహనాల డ్రైవర్లకు ఉచితంగా ఈ కిట్లు అందించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. 4 మాస్క్ లు, 4 గ్లౌస్ లు, 2 డెట్టాల్ సబ్బులు, 1 శానిటైజేర్ బాటిల్ ఈ కిట్ లో ఉంటాయని రవాణా శాఖ ఉప కమీషనర్ సి.హెచ్.శ్రీదేవి తెలిపారు. వాహన డ్రైవర్లు ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంటారని, డ్రైవర్ లకు కోవిడ్ నుండి రక్షణ కల్పించేందుకే ఈ కిట్ ను వారికి ఉచితంగా అందిస్తున్నామని ఉప రవాణా కమీషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు రవాణా శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు.  కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారి బుచ్చిరాజు, సహాయ తనిఖీ అధికారి దుర్గ ప్రసాద్, కృష్ణ మోహన్, శ్యాం ప్రభు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...