ప్రజలకు సేవచేస్తుంటే అడ్డుకోవడం తగదు
అనకాపల్లి, పెన్ పవర్ : వానపల్లి రమణ
విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రజలకు సేవ చేయాలి కానీ రాజకీయ ముసుగులో అధికార పార్టీ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు ను అడ్డుకోవడం తగదని మాజీ శాసనసభ్యులు,నియోజకవర్గ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ప్రజలకు మంచి జరగడం వైకాపా నాయకులకి ఇష్టం లేదని అన్నారు. అనకాపల్లి లో అధిక పార్టీకి ఒకలాగా, ప్రతి పక్ష పార్టీలతో ఒకలాగా అధికారులు వ్యవహరించడం దారుణం అని అన్నారు. వైరస్ వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతోనే తాము రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత డబ్బులతో పట్టణంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తుంటే,వారిని అడ్డుకోవడంతో శుక్రవారం ఆర్ డి ఓ, జోనల్ కమిషనర్, సర్కిల్ఇన్స్పెక్టర్ లను కలిసి ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. అధికారులు సైతం అధికార పార్టీవారి అడుగులకు మడుగులొత్తడం సమాంజసం కాదని అన్నారు."అధికార పార్టీ నేతల వొత్తిళ్ల మేరకే" అధికారులు ఇలా తాము చేస్తున్న ప్రజా ఆరోగ్యహిత కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ళ సురేంద్ర, జోగి నాయుడు, బొద్దపు ప్రసాద్, అర్రెపు కామేష్, కాయల మురళి, పొలారపు త్రినాధ్,సబ్బవరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment