అనకాపల్లి, పెన్ పవర్
శారద నదిని కలుషితం చేసి వేలాది మంది ప్రజలు ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పై జీవీఎంసీ వారు అంటువ్యాధుల నిరోధక చట్టం ద్వారా కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్ ను శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు కోరారు. ప్రస్తుతం శారదా నదిలో నీటి ప్రవాహం లేదని అక్కడక్కడ మాత్రమే నీరు ఉంటుందని ఇటువంటి తరుణంలో వేలాది గ్యాలన్ ల నీరు,విషపూరిత వ్యర్ధ జలాలను ఫ్యాక్టరీ యాజమాన్యం నదిలోకి విడిచిపెట్టి నదీ పరివాహక ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని నాగ జగదీష్ ఆగ్రహం వ్యక్తపరిచారు.
ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత ప్రజలను భయాందోళనకు రేకెతికిస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు జీవీఎంసీ అధికారులు అలసత్వానికి నిదర్శనమని వ్యర్థ జలాలు తాగునీటి బోర్లు వద్దకు చేరి భూగర్భ జలాల్లో చేరి డయేరియా,కలరా వంటి వ్యాధులుతో పాటు అనేక చర్మ వ్యాధులకు గురి కాక తప్పదని నదీ గర్భంలో గల మత్స్య సంపద మొత్తం చనిపోయినందున చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు కొన్ని నెలలపాటు పస్తులు ఉండక తప్పదని తెలిపారు ప్రస్తుతం నదిలో కలిసిన వ్యర్ధ జలాల యొక్క తీవ్రత తగ్గాలంటే తక్షణమే రైవాడ రిజర్వాయర్ నందు గల నీరు సర్దార్ నదిలోకి విడిచిపెట్టి తాగునీటికి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు ఫ్యాక్టరీ యాజమాన్యం పై రాష్ట్ర కాలుష్య నిరోధక మండలి కేసులు నమోదుచేసి విచారణ కమిటీని వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు దీనిపై శాసన మండలి జరిగే సమయంలో చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు.
No comments:
Post a Comment