సాలూరు, పెన్ పవర్
సాలూరు పట్టణము లోని లారీ వర్కర్స్ అయినటువంటి డ్రైవర్స్, క్లీనర్లు మరియు మెకానిక్ స్టాఫ్ అందరికి సాలూరు పట్టణ పోలీస్ వారి విజ్ఞప్తి చేశారు. డ్యూటీలలో భాగంగా మీరు బయట రాష్ట్రాలకు, జిల్లాలకు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చేటప్పుడు మీరు మీ యొక్క వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాధి నియంత్రణలో మీ వంతు బాధ్యత పాటించండి. అలాగే మీరు మీ డ్యూటీ నుండి మీ ఇంటికి వచ్చేటప్పుడు మీయొక్క దుస్తులు, వస్తువులను బయటనే విడిచిపెట్టి వాటిని సరిగా శుభ్రం చేసి, మీరు శుభ్రంగా స్నానం చేసిన తర్వాతనే మీ ఇంటిలోనికి వెళ్ళాలి. మీ కుటుంబ సభ్యులతో మరియు సన్నిహితులతో వీలైనంత దూరం పాటించండి. మిగిలిన సమయాల్లో అనవసరంగా పట్టణంలో సంచరించకండి... మీరు మీ యొక్క వాహనాలలో ప్రయాణములో ఉండగా బయట వ్యక్తులను గాని, అపరిచిత వ్యక్తులను ఎక్కించుకోవడం గానీ, లిఫ్ట్ ఇవ్వడం గానీ చేయరాదు... ఎందుకంటే వారి నుండి కూడా కరోనా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువు ఉన్నాయని, డ్రైవర్లు, క్లినర్లు మీ వాహనంలో డ్రైవర్, క్లీనర్ మినహాయించి ఇంకెవరు వున్నట్లు పట్టుబడిన, వారితో పాటు మీరు కూడా క్వారంటైన్ హోమ్ కి తరలించబడతారని వాహనం కూడా సీజ్ చేయబడుతుందని హెచ్చరించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించండి శానిటైజెర్స్ ను వాడాలని చెప్పారు.
No comments:
Post a Comment