Followers

పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు : ఎమ్మెల్యే అధీప్ రాజు


కరోనా అంతానికి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు


             పరవాడ పెన్ పవర్

 

పరవాడ:మండలం లోని పోలీస్ స్టేషన్ పరిధిలో కల 100 మంది పోలీసులకు స్వీయ నిర్బంధం(లాక్ డవున్)నిబంధనలు ఉన్న ఏప్రిల్ 14 వరకు మధ్యాన్నం భోజన సదుపాయం ఏర్పాటు చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధీప్ రాజు.శనివారం నాడు పరవాడ లో ఏర్పాటు చేసిన కార్యక్రంలో పోలీసు సిబ్బంది కి భోజనం పేకెట్లను సర్కిల్ ఇనిస్పెక్టర్ రఘువీర్ విష్ణు కి అందచేశారు.ఎమ్మెల్యే అధీప్ రాజు తన సొంత నిధులతో ఏప్రిల్ 14 వరకు పోలీసు సిబ్బందికి మధ్యాన్నం భోజన సదుపాయం చేస్తున్నట్లు తెలియ చేశారు.కరోనా కారణంగా రాత్రిoభవళ్ళు ప్రజాశ్రేయస్సు కోసం ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్న మండు టెండలో కూడా విధులను నిర్వహిస్తున్న పోలీసు శాఖ సిబ్బందిని అభినoదిస్తూ    ప్రజలందరి తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,వైసిపి   పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ అన్నం రెడ్డి అజయ్ రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల వైసిపి అధ్యక్షుడు సీరిపురపు అప్పలనాయుడు,ఎఫ్ సి ఐ మెంబర్ పయిల సన్యాసి రాజు,స్కూల్ తల్లిదండ్రుల చైర్మన్ పయిల హరీష్,మండల యువజన విభాగం అధ్యక్షుడు పెద్దిసేట్టి శేఖర్,పోలీస్ సిబ్బంది,ట్రాఫిక్ పోలీసు సిబ్బంది,     కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...