గడ్డం, టోపి ఉంటే ఆ రోగి గేటు బయటే
నిన్న గిరిజన మహిళకు - నేడు మైనార్టీ మహిళకు ఘోర అవమానం
తీరు మార్చుకోని మార్కాపురం వైద్య సిబ్బంది
నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం
(పెన్‌పవర్, మార్కాపురం ఆర్‌సి ఇన్‌ఛార్జి)
ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే కుల , మతాలకు అతీతంగా చేతులెత్తి మొక్కేది ప్రధానంగా వైద్యుడినే. కానీ ఆ వైద్యుడు మాత్రం తన నరనరాల్లో కులాన్ని ఎక్కించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్నా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఢల్లీ జమాతేకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో వైద్యులు తాము వైద్యులమని మరచి కులాల పేరుతో రోగులకు నరకం చూపిస్తున్నారు. కేవాలం బురఖా వేసుకుని వచ్చారన్న సాకుతో తొమ్మిది నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గెంటేసిన వైనం ఆలస్యంగా మెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే వెనుకబడి ఉన్న పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని 12 మండలాలకు ఉపయోగపడేలా డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ఏరియా వైద్యశాలను నిర్మించారు. ఇటీవలనే ఈ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేశారు. రోజుకు అయిదు వందలకు పైగా ఓపి ఉండే ఈ వైద్యశాలలో పూర్తి స్థాయి వైద్యులు లేకపోగా, ఉన్న కొద్ది మంది వైద్యులు వృత్తికి తగ్గ సేవను కొనసాగించకపోవడంతో ఈ వైద్యశాల నిత్యం పత్రికలలో కెక్కుతూ ఇక్కడి వైద్యుల పనితనం పై రకరకాల వార్త కధనాలతో ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఈ ఆసుపత్రిలో ఓ వైద్యుడు విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో జిల్లా కలెక్టర్ వేగంగా చర్యలు చేపట్టి సస్పెండ్ చేశారు. కాని ఓ నిండు గర్భిణీ గెంటేసిన వారిపై మాత్రం ఇంత వరకు ఏ చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కల్గించకమానదు. ఈ వైద్యశాలలో పని చేసే వైద్యులు, సిబ్బందికి వృత్తి పట్ల నిబద్దత లేకపోవడం వైద్యశాలకు శాపంగా మారింది. వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యుడు దేవుడితో సమానమని అంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నా ఈ వైద్యశాలలోని డాక్టర్లు రోగులపట్ల చిన్నచూపు, వ్యక్తులపట్ల వివక్ష, గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చిన వారి పట్ల చీదరింపు, అమ్మ, అయ్యా అని ప్రాథేయపడితే గెంటివేతల లాంటివి చేస్తుండడంతో రోగులు అవమానాను ఎదుర్కోంటు ఇబ్బందు పడుతున్నారు. ఇటీవల వైద్యం కోసం వచ్చిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ సుగాలి తాండాకు చెందిన తల్లి, కూతూళ్లను ఓ వైద్యుడు బండబూతులు తిట్టి చేయి చేసుకొని గెంటి వేశారు. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల లోనే యంఆర్‌పియస్ రాష్ట్ర ప్రదానకార్యదర్శి చాట్ల డానియేులు బంధువు అయిన 68 సంవత్సరాల వృద్థురాలిని ఇన్ పేషెంట్ హాలు నుంచి బయటికి నేట్టి, ఇది మీ అత్తగార్లిు అనుకుంటున్నావా ఇంకెన్ని రోజు ఉంటావంటూ దుర్భాషాలాడుతూ అవమానించారు. ఈ సంఘటన కూడా పత్రికలలో ప్రచురితమై రచ్చ జరిగింది. రెండు వారా క్రిందట ఓ ముస్లిం మహిళ పట్ల వైద్యు ఇలానే అనాలోచితంగా ప్రవర్తించి హేళనగా మాట్లాడగా భర్త వైద్యశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన చేయడంతో ఖంగుతిన్న సిబ్బంది కొందరి ద్వారా రోగిని బుజ్జగింపజేసి సద్దు మనిగేలా చేశారు. కాగా శుక్రవారం వైద్యశాల సూపరింటెండెంట్ ఓ ముస్లిం జంట పై వివక్షపూరిత వ్యాఖ్యాలు చేసి అవమానపరచారు. పరీక్ష నిమిత్తం వచ్చిన నిండు గర్భవతిని నానా దుర్భాషలాడి వైద్యం నిరాకరించి తిరిగి పంపించడం పట్ల మరో మారు వైద్యుల వ్యవహారం మార్కాపురంలో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీకి చెందిన పఠాన్ అజ్మతుల్లా కార్పెంటర్ వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. నిండు గర్బిణి అయిన తన భార్య రమిజాను వైద్య పరీక్ష నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్ళాడు. సాంప్రదాయ పరంగా బురఖాలో ఉన్నా రమిజాను చూసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన వైద్యుడు అసహనంతో నోరు జారడంతో పాటు గడ్డంతో ఉన్న భర్తను గేటు బయట ఉండమని ఆదేశించాడు. తొలి కాన్పు ఎక్కడా చేయించుకున్నావో, అక్కడే రెండో కాన్పు చేయించుకోవచ్చు కదా ! ఇక్కడికెందుకొచ్చావు ! గడ్డంతో ఉన్నా నీ భర్త ఢల్లీ కి వెళ్ళాడా, నిజం చెప్పు, మీ లాంటి వారికి వైద్యం చేస్తే మేము కాటికి వేళ్ళాల్సి వస్తుంది. అంటూ పలువురి ముందు మనోభావం దెబ్బతీనేలా మాట్లాడి వైద్యం చేయకుండా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా వైద్యశాల నుంచి తిరిగి పంపించడంతో వారు చేసేదేమిలేక కొందరి సహాయంతో స్ధానిక కందుల ఓబులరెడ్డి వైద్యశాలలో కాన్పు కోసం చేరారు.
శాఖపరమైన చర్యు తీసుకోవాలి
యంపిజె డిమాండ్
వైద్య పరీక్షల కోసం వెళ్లిన ముస్లిం జంట పట్ల వివక్ష ధోరణితో వ్యవహరించిన మార్కాపురం జిల్లా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టీస్ జిల్లా ప్రదాన కార్యదర్శి షేక్ అబ్ధుల్ రజాక్ డిమాండ్ చేశారు . రాజ్యాంగానికి విరుద్దంగా వైద్యులు రోగుల పట్ల వ్యవహరించడం సహించరానిదని, ఈ విషయాన్ని జిల్లా అధికారులతో పాటు మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెల్లనున్నట్లు తెలిపారు. వైద్యశాల తీరు మారేలా చర్యలు తీసుకోవాని డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని శనివారం యంపిజె నాయకులు వైద్యశాల సూపరింటెండెంట్ కు అందజేశారు.
No comments:
Post a Comment