పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి : సతీష్
38 వ వార్డు ఘోష ఆసుపత్రి జంక్షన్ నందు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని సయ్యద్ తహసీన్ భాను , ఉత్తరాంధ్ర మైనారిటీ సంఘ నాయకులు సయ్యద్ ముస్తఫా ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా క్షేమం కొరకు పని చేస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన మరియు గౌరవించాల్సిన అవసరం ఉన్నదని గత 20 రోజులుగా అనేక విధాలుగా తహసీన్ భాను నేతృత్వంలో వారికి మరియు వార్డు లో గల నిరు పేద ప్రజల కోసం కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు, మంగళవారం పారిశుధ్య కార్మికులకు శాలువాతో సత్కరించి వారికి మిఠాయిలు పంచిపెట్టారు, మరియు కరోనా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కార్మికులకు మరియు ప్రజలక తెలియజేశారు. ఈ కష్టకాలంలో 38 వార్డులో ప్రజలకు నిరంతరం అన్నివేళలా అండగా ఉంటామని ముస్తఫా విజ్ఞప్తి చేశారు, స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి కులమతాలకు అతీతంగా పార్టీలకతీతంగా పేద ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా కరోనా వ్యాధిని నివారించడానికి కృషిచేయాలని తెలియజేశారు
No comments:
Post a Comment