ఘనంంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
గాజువాక, పెన్ పవర్ :ఫిరోజ్
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించారు వైసీపీ నాయకులు దామా సుబ్బరావు .
భారత రత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , ప్రపంచ మేధావి ,రాజ్యంగా రూపకర్త, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి వేడుకలను 86వ వార్డులో కూర్మన్నపాలెం జంక్షన్ , ఫకీర్ తఖియా, దువ్వాడలలో ఘనంగా నిర్వహించారు డా.బిఆర్ అంబెద్కర్ విగ్రహంకి పూల మాల వేసి నివాళు అర్పించారు దామా సుబ్బరావు. ఈ సందర్భంగా దామా సుబ్బరావు మాట్లాడుతూ భారత రాజ్యంగ నిర్మాత డా. బి ఆర్ అంబెద్కర్ ఆశయాలను, యువత ముందుకు తీసుకోని వెళ్ళాలని పిలుపు నిచ్చారు, ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మెడికల్ బాబు , మాటూరి శ్రీనివాస్ , యోహన్ , బలిరెడ్డి నాగేశ్వర్రావు , అప్పారావు , నిర్మాల , పెంటారావు , చెగొండి శ్రీను , బార్ సాయి , అనీస్ , రాజు తదితరులు పాల్గున్నారు
No comments:
Post a Comment