సేవాకార్యక్రమాల్లో అరుణ 'కిరణం'
ఆరిలోవ, .పెన్ పవర్ ప్రతినిధి కూచిపూడి భాస్కర్ కుమార్
పూజలు చేసే చేతులు కన్నా... సేవలు చేసే చేతులు మిన్న... స్పూర్తి తో బీజేపీ నాయకురాలు అరుణోధయానికి ముందే అరుణ కుమారి అడుగులు వేస్తున్నారు. మోది లాక్ డౌన్ ప్రకటించిన నుండి ప్రతి రోజు ఉదయాన్నే 18 వార్డు లో పర్యటిస్తూ అనేక సేవాకార్యక్రమములు నిర్వహిస్తున్నారు, రాజకీయాలను పక్కన పెట్టి పేదలు, అనాధలకు ఆమె తన వంతుగా సేవలు అందిస్తున్నారు. పేదలకు భోజనం, నిత్యవసర సరుకులు ఇస్తున్నారు. వార్డు లో పేదలను గుర్తించి వారికి ప్రతి రోజు ఉదయాన్నే అల్ఫాహారం గా పులిహారా, ఉప్మా, ప్యాకేట్లను పంపిణీ చేస్తుంటారు . అంతేకాకుండా వార్డులో కలియతిరుగుతూ నిరాశ్రయులను గుర్తించి వారికి కావలసిన వైద్య సాదుపాయంతో పాటు వారికి ఆర్ధిక సహాయం చేయటం జరుగుతుంది. ఇటు వంటి సేవమూర్తులను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
No comments:
Post a Comment