విజయవాడ నుంచి నడుచు కుంటూ...
పాయకరావుపేటకు చేరుకున్న21మంది వలస కూలీలు
అర్ద రాత్రి కూలీల ఆకలి తీర్చి న ఎస్ ఐ విభూషణ్..
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం , పెన్ పవర్ : మజ్జి శ్రీనివాస మూర్తి
తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ నుండి 21 మంది వలస కూలీలు ఓ లారీ లో కృష్ణా జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద దిగారు. విజయవాడ నుండి గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరి నడుచు కుంటూ వలస కార్మికులు శుక్రవారం రాత్రి సమయానికి పాయకరావు పేట కు చేరుకున్నారు.హైదరాబాద్ నుండి ఏ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లోనూ పకడ్బందీ గా ఏర్పాట్లు లేకపోవడంతో వారు పాయాకరావుపేట వరకు వచ్చేసారు.జిల్లా ఎస్.పి అట్టాడ బాబుజీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన విశాఖ జిల్లా సరిహద్దు చెక్ పోస్టు వద్ద పకడ్బందీ గా విధులు నిర్వహిస్తున్న పాయకరావుపేట ఎస్.ఐ విభూషణరావు వారి వివరాలు అడుగగా వారు శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి,నంది గామ మండలాల చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలని గత రెండు రోజులుగా నిద్ర హారాలు లేకుండా పొట్ట చేత పట్టుకొని మా స్వగ్రామాలకు వెళ్ళేందుకు విజయవాడ నుండి ఏ ఒక్క వాహనం అపకపోవడం వల్ల కాలి నడకన బయలు దేరి వస్తున్నామని తెలిపారు. వారి ఇబ్బందులు తెలుసుకుని వారి ఆకలిని గమమించిన ఎస్.ఐ వారికి భోజనాల ఏర్పాట్ల కై సంబంధిత రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించక పోవడంతో మీడియా చొరవతో ఎస్.వి.ఎస్ దాబా యజమాని పులి బాబ్జీ ఆర్దిక సాయంతో స్థానిక ఎస్.ఐ విభూసనరావు మానవతాదృక్పదంతో భోజనాలు పెట్టించారు.
No comments:
Post a Comment