స్టీల్ఎక్ష్చేంజ్ కంపెనీ కార్మికులు ఎల్.కోట. ఎస్సై పై దాడి.
లక్కవరపుకోట, పెన్ పవర్
. మండలంలోని శ్రీరాంపురం వద్ద గల స్టిల్ ఎక్స్చేంజ్ కంపెనీలో పని చేస్తున్నా కార్మికులు స్థానిక ఎస్ఐ కే ప్రయోగమూర్తి, పోలీసు సిబ్బంది పై కంపెనీ బయట గురువారం దాడి చేసి పోలీసు వాహన అద్దాలను పగలగొట్టి దాడి చేశారని పోలీసులు తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి నిబంధనలు అమలులో ఉన్న కారణంగా ప్రజానీకం ఎవరైనా మూకుమ్మడిగా ఉంటే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆ కారణంగా నిబంధనలు అమలు చేస్తున్నామని విరుద్ధంగా నడుస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే కంపెనీ కార్మికులు స్టీల్ఎక్షచేంజ్ కంపెనీ ఎదుట గుమిగూడి ఉండడంలో ఎస్సై తన సిబ్బంది తో వెళ్లి చెదరగొట్టే క్రమంలో కంపెనీ యాజమాన్యం నెల రోజుల నుంచి జీతభత్యాలు తమకు చెల్లించలేదని కరోన మహామ్మారి వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ... గేటు బయట ఎస్ఎంఎస్ కార్మికులు తీవ్ర ఆందోళనకు దిగడంతో ఆ క్రమంలో మూకలు గుంపును చెదరగొట్టే గ్రామంలో తీవ్ర ఆకలి బాధతో ఉన్న కార్మికులు వెంటనే ఎస్సై, పోలీసు సిబ్బంది పై తిరుగుబాటు చేసి కలియపడ్డారని స్థానికులు తెలిపారు వెంటనే ఎస్ఐ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సంప్రదింపులు చేసి వివరణ అడుగగా కార్మికులకు ఎలాంటి బకాయిలు లేవని తెలిపారు అని తెలిపారు ఎస్సై పై పోలీసు సిబ్బంది పై దాడి చేసి పోలీసు వాహణం అద్దాలు పగలగొట్టిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.
No comments:
Post a Comment