శ్రీకాకుళం/రాగోలు, పెన్ పవర్
శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం మరియు గ్రామమునకు చెందిన మేము సైతం అసోసియేషన్ ఆద్వర్యం లో కరోనా ప్రభావం చే ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగిస్తున్న కారణం చేత రక్తం కొరత వున్నదని పలు పత్రికల ద్వారా తెలుసుకొని రక్తం కొరత అధిగమించాలని స్వచ్చంగా దాతలను ప్రేరేపించి తేది ఆదివారం ఉదయం రాగోలు గ్రామం లో స్వచ్చందంగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి 15 మంది అసోసియేషన్ సభ్యులతో రక్త దానం చేయించినారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు మాటలాడుతూ కరోనా వ్యాప్తి చెందుచున్న కారణముగా ప్రతి వ్యక్తి కనీస దూరం పాటించ వలెనని, మరియు తుమ్ము, దగ్గు వచ్చినప్పడు రుమాలు అడ్డుపెట్టు కొనవలనని, కొన్ని సూచనలు, జాగ్రతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమములో మా సైతం సభ్యులు గి.చంద్ర శేఖర్, టి.లక్ష్మణ రావు, వై.రామకృష్ణ, పి.అప్ప రావు, పి.వి.ఎస్.యన్.మూర్తి మరియు రెడ్ క్రాస్ సిబ్బంది డాక్టర్ యం.చిట్టిబాబు, సూర్యప్రకాష్ రావు, బాబు రావు, ఉమాశంకర్, గఫూర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment