కరోనా కేసులు దాచి పెడుతున్నట్లు వస్తున్న ప్రచారం వాస్తవం కాదు.
ఆంధ్ర మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.సుధాకర్ కామెంట్స్
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
విశాఖలో కరోన పాజిటివ్ కేసులు దాచిపెడుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ అన్నారు. మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దాచి పెడుతున్నారని అసత్య ప్రచారం జరుగుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు ప్రణంగా పెట్టి కరోనా వైరస్ నిర్మూలనకు కృషిచేస్తున్న మని స్పష్టంచేశారు. వచ్చిన కేసుల వివరాలు నిష్పక్షపాతంగా వెల్లడిస్తున్నామని . కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దాచిపెడితే దాగదు అని తెలిపారు.ప్రతి రోజూ కేంద్ర ఆరోగ్య శాఖకు కేసుల వివరాలతో నివేదికను పంపుతున్నామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని గా చేయటం కోసం కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా చూపించటం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
ఇప్పడు రాకపోయినా? భవిష్యత్తు లో వచ్చినా వున్నది వున్నట్టు నివేదికను ఇవ్వటం జరుగుతుంది
ఎవ్వరూ పాజిటివ్ కేసులు విషయంలో అపోహలు పడవలసిన అవసరం లేదని సుధాకర్ పెర్కొన్న రు.
No comments:
Post a Comment