Followers

ఐదవ వార్డు ప్రజలకు అండగా నేనుంటా! మొల్లి లక్ష్మణరావు


ఐదవ వార్డు ప్రజలకు అండగా నేనుంటా! మొల్లి లక్ష్మణరావు


 విశాఖపట్నం/మధురవాడ, పెన్ పవర్


 మదురవాడ 5వ వార్డు ప్రజలకు మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని శివశక్తి నగర్ లో ప్రారంభించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ సందర్బంగా ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్లకే పరిమితం కావడంతో పేద ప్రజలకు జీవనోపాధి కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో తన వంతు సహాయంగా 5 వార్డు ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం శివశక్తినగర్ నుండి ప్రారంభించారు, ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ చేయుట లో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, జివిఎంసి సిబ్బందికి, డాక్టర్లకు, పత్రిక విలేకరులకు లక్ష్మణరావు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వాండ్రాసి అప్పలరాజు, మన్యల సోంబాబు, బోయి శీను, ఈగల రవి, నాగోతి సత్యనారాయణ జపాన్, నాయుడు సూరిబాబు, వి బాబులు, యువ నాయకుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు..


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...