భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలి
---- పట్టణ అధ్యక్షులు మందపాటి
అనకాపల్లి , పెన్ పవర్
ప్రతిఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు కోరారు. మంగళవారం పట్టణంలో 82 వ వార్డు విజయరామరాజుపేటలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విపత్కర పరిస్థితిలో పేదలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. యువత సాయంతో బాధితులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయ రామరాజు పేటలో, లెప్రసీకాలనీ లో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ ని నిర్వహించారు. కార్యక్రమంలో అప్పికొండ వెంకటరావు, పలకా వాసు, ఉగ్గిన శ్రీను , అల్లు త్రినాధ్, దాడీ గణేష్, శ్యామ్, మంగ రాజు , రాజన్న, శ్రీను , సూర్య, మూల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment