విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు
ప్రజల సహకారం, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లా లో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం అభినందించదగ్గ విషయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం నాడు పట్టణంలోని ఆర్ అండ్ బి రైతు బజార్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఆఫ్ విజయనగరం సంస్థ ఏర్పాటుచేసిన క్రిమిసంహారక (Dis Infection Tunnel) టన్నెల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వీరందరి సమన్వయంతో కరోనా నివారణకు తగు చర్యలు చేపడుతూ ప్రజల సహకారంతో జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనా ను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇటీవలే ఈశ్వర్ కౌశిక్ ఆధ్వర్యంలో రాజీవ్ స్టేడియంలో బిజినెస్ ఆఫ్ యూత్ విజయనగరం పేరిట క్రిమిసంహారక ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.భౌతిక దూరం పాటించడంవల్ల కరోనా నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, పాత్రికేయులు , పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమానం అని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట వంతమైన చర్యలు చేపట్టిందన్నారు. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం లో జిల్లా అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను కట్టడి చేయాలన్న ఆలోచనతో ఆయా మాధ్యమాల ద్వారా తమిళనాడులోని తిరుపూర్ లో క్రిమిసంహారక టన్నెల్ ను ఏర్పాటు చేయడాన్ని చూడడం జరిగిందని, మన విజయనగరంలో కూడా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో ఏర్పాటుకు మొట్టమొదటగా రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, మార్కెట్ కమిటీ ఏ డి శ్యాం కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్, విన్నకోట ప్రభాకర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కాళ్ల సునీల్, మొక ర గాంధీ, రౌండ్ టేబుల్ సంస్థ వైస్ చైర్మన్
గూడేసా కార్తీ,క్, సంస్థ కార్యదర్శి ఆరి శెట్టి సుమంత్, , అవినాష్ గాంధీ తదితరులు ఉన్నారు...
No comments:
Post a Comment