లాక్ డౌన్‌కు సహకరించండి
మాకవరపాలెం, పెన్ పవర్ ప్రతినిధి గోవింద్
మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మాకవరపాలెం ఎస్సై కరక రాము కోరారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవాలు కోరే వారి పేరు, ఆధార్ కార్డు నెంబర్, వాహనం నెంబర్, వాహన డ్రైవర్ లైసెన్స్ నెంబరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్‌తోపాటు ఎందు నిమిత్తం వెళ్తున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలపాన్నారు. అటువంటి దరఖాస్తుకు అనుమతి ఇస్తామన్నారు. అటువంటి వాటిని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో జిల్లా ఉన్నత అధికారులు అనుమతితో తిరిగి రావాల్సి ఉందన్నారు. ఇది అత్యవసర వైద్య సేవ కొరకు మాత్రమేనని ఆయనన్నారు. నిత్యావసర సరుకులకు వాహన డ్రైవర్‌తో పాటు ఒక సహాయకుడుని అనుమతిస్తామని అధిక సంఖ్యలో జనాలు ఉన్నట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందజేసే కార్యక్రమం చేపట్టినట్లు అయితే గ్రహీత యొక్క గృహాలు వద్దనే అందజేయాలని, గుంపుగా గుమి గూడ రాదని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment