విపత్తు సమయం లో మీడియా మిత్రులకు, ప్రజలకు సహాయం చెయ్యడం అభినందనీయం
పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు
పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్, పెన్ పవర్
కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఇళ్ల కే పరిమితమైన పోలవరం మండలం గూటాల గ్రామం లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువులైన కూరగాయలను వైసిపి సీనియర్ నాయకులు సుంకర వెంకటరెడ్డి అందజేశారు. ఇటువంటి విపత్తు సమయాలలో సహాయం చేయడం అభినందనీయమని పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం పోలవరం మండలం గూటాల పంచాయతీలో సుమారు 1500 కుటుంబాలకు సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన డీఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు ఎవరూ తిరగకూడని పరిస్థితుల్లో నేరుగా ఇంటింటికీ కాయగూరలను పంచడం అభినందనీయమని వైసీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ సుంకర వెంకటరెడ్డిని ప్రసంసించారు. ఈ కార్యక్రమంలో పత్రికా విలేఖరులకు,మీడియా ప్రతినిధులకు నిత్యావసరాలు బియ్యం , కిరాణా, కూరగాయలను గూటాల ఎస్ వి ఆర్ గ్యారేజ్ సభ్యులు, సుంకర వెంకటరెడ్డి, గూటాల సొసైటీ అధ్యక్షులు సుంకర అంజిబాబు అందజేశారు . ఈ కార్యక్రమంలో పోలవరం సిఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ ఆర్ శ్రీను , ఎంపీడీవో జే మన్మధరావు, పట్టిసీమ పంచాయతీ సెక్రెటరీ దత్తు, గూటాల వీఆర్వో ప్రసాద్, వైసీపీ నాయకులు, సుంకర అంజిబాబు,సుంకర కొండబాబు ,పండు ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment