Followers

వైసిపి నాయకులు కూరగాయల పంపిణి


 




79 వ వార్డ్ లో వైసిపి నాయకులు కూరగాయల పంపిణి


 

            పరవాడ,  పెన్ పవర్ 

పరవాడ మండలం:జివిఎంసి పరిధి 79 వ వార్డు లంకెలపాలెంలో బుధవారం నాడు వైయస్సార్ సిపి నాయకులు కాయగూరలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమే.దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో ఉన్న వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రజలకు తగినంత సహాయం చేయాలని పిలుపు నిచ్చారు.అందులో భాగంగానే 79 వ వార్డు లో నివసిస్తున్న గోడ్డి పేట, బిసి కాలనీలో ఉన్న సుమారు ఐదు వందల కుటుంబాలకు నిత్యావసరం లో భాగమైన కాయగూరలు, కోడిగ్రుడ్లను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీను, సుందరపు అప్పారావు, గెంజి సురేష్, సుందరపు శ్రీనివాస్, కాతా నూకేశ్, వై వెంకటరావు, సిమ్మీ దేముడు,  మామిడి బోర్రి సత్యనారాయణ 79 వ వార్డు వైఎస్ఆర్సిపి యూత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...