Followers

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండో విడత బియ్యం, శనగలు పంపిణీ.


 


రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండో విడత బియ్యం, శనగలు పంపిణీ.

 

పోలవరం,  పెన్ పవర్ ప్రతినిధి రాము 

 

 

 

కోవిడ్ 19 ప్రభావంతో లాక్ డౌన్ అమల్లోనే ఉన్నందున ఇంటికే పరిమితమైన ప్రజలకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత బియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించినట్లు పోలవరం తాసిల్దార్ ఎన్ నరసింహమూర్తి అన్నారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై డి టి ఎస్ కె సలీం , వీఆర్వోలు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి రేషన్ సరుకులు పంపిణీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేసినట్లు తాసిల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తారీకు నుండి 27వ తారీఖు వరకు నిత్యావసర సరుకులు రేషన్ కార్డు ఉన్న ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం, రేషన్  కార్డుకు కేజీ సెనగలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్డు రకం తో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సరుకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పంపిణీ సమయంలో సర్వర్ సమస్యలు ఉన్న చొ మ్యాన్యువల్ పద్ధతిలో సరుకులు పంపిణీ చేస్తారన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ఏ సమయంలో ఏ తారీఖున రావాలో కూపన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదనపు పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ దుకాణం వద్దకు వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్కు లు ధరించడం వంటి జాగ్రత్తలు రేషన్ వినియోగదారులు తప్పక పాటించాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద టెంట్లు వేయడం, త్రాగునీరు, సబ్బు, చేతులు కడుక్కునేందుకు నీళ్లు, రేషన్ దుకాణాల పరిసర ప్రాంతాలలో బీజింగ్ చల్లడం వంటివి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. రేషన్ దుకాణాల వద్దకు జనం గుంపులు గుంపులుగా రావద్దని సూచించారు. ఈ కార్యక్రమమును నిరంతరం అధికారులు  పర్యవేక్షిస్తారు అన్నారు. రేషన్ సరుకులు తూకంలో ఏ విధమైన తేడాలున్నా, రేషన్ డీలర్లు చేయవలసిన ఏర్పాట్లు చెయ్యకుండా అధికారులకు తెలియజేయాలని రేషన్ వినియోగదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం తాసిల్దార్ ఎన్ నరసింహ మూర్తి, సివిల్ సప్లై డి టి ఎస్ కె సలీం, సీనియర్ అసిస్టెంట్ కాజా రమేష్, డిప్యూటీ తాసిల్దార్ జె అర్జున్ రావు, వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ సచివాలయం గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఎమ్మార్వో సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...