Followers

కరోనా పాజిటివ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు పరిశీలన



 


 కరోనా పాజిటివ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జివిఎంసి అదనపు కమిషనర్


విశాఖపట్నం, పెన్ పవర్ 


 జివిఎంసి నాలుగవ జోన్ పరిధిలో గల వార్డు నెంబరు 32, 42 వార్డులలో వచ్చిన కరోనా పాజిటివ్ ప్రాంతాలలో అమలవుతున్న పారిశుద్ధ్య పనులను జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ముఖ్య ప్రజారోగ్య అధికారితో కలసి పరిశీలించారు. సంబంధిత నాలుగవ జోన్ అసిస్టెంటు మెడికల్ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్ స్పెక్టర్లతో చర్చిస్తూ, పారిశుద్ధ్యం పనులు పై పలు సూచనలు చేశారు. దగ్గరుండి ఆయా ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని అగ్నిమాపక వాహానం ద్వారా స్ప్లే చేయించారు. రోడ్ల మార్జిన వద్ద గల చెత్త బిన్లు నుండి చెత్తను తీసివేసిన తర్వాత, కాలువలలో చెత్తను తొలగించి, ఎత్తివేసిన తర్వాత, బ్లీచింగ్ తో కలిపిన లైమ్ పౌడరును జల్లాలని, పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతం నుండి సుమారు 5 కిలో మీటర్ల వరకు, రసాయన ద్రావణాలను రోడ్లపై వాహానంతోను, ఇరుకు ప్రాంతాలలో ట్యాంకుల ద్వారా జల్లించాలని, బ్లీచింగ్ పౌడరును తప్పనిసరిగా వేయాలని, ఆయా ప్రాంతాలలో ఏమైనా కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు గల గృహములను గుర్తించినచో వెంటనే జోనల్ ఆధికారులకు తెలియపరచాలని, ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ, నోటికి మాస్కులు, చేతికి చొజులు వేసుకొని చాలా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే తగు కఠినచర్యలు చేపడతామని వారికి హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో క్రమశిక్షణతో పనిచేసి, జివిఎంసి కమిషనర్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాలని, పారిశుద్ధ్య విభాగపు జోనల్ స్థాయి అధికారులను, సిబ్బందిని, కార్మికులను ఆయన కోరారు. ఈ పర్యటనలో సిఎంఓహెచ్ కెఎస్ఎన్ఎ శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ రాజేష్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, వార్డు ప్రత్యేక ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...