సమకూరిన రూ.20 లక్షలు నగదుని చెక్ ల రూపంలో విశాఖ నగర సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీసు ) ఆర్.కే మీనాకు అందజేత
విశాఖపట్నం, పెన్ పవర్
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోన నియంత్రణకు పలువిధాలుగా తోడ్పాటు నందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో కరోన కట్టడికి తనవంతు సహాయంగా రూ. 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ అడుగు ముందుకు వేసి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోన నియంత్రణలో భాగంగా డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను పొగిడిన ఆయన , తాజాగా పోలీసులకు తోడ్పాటునందించారు. రాత్రనకా, పగలనకా పహారా కాస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడి, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఆదేశాలను తూ.చా తప్పకుండా విధులు నిర్వహిస్తున్న రక్షక భటుల కై నడుంబిగించారు. తన పార్లమెంట్ పరిధితో పాటు పలువురిని ఈ విషయంపై జాగృతాపరుస్తూ పోలీసులకు నిధులు సమకూర్చారు. ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ లో విష్ణు కెమికల్స్ అధినేత సీ.హెచ్ కృష్ణమూర్తి రూ.10లక్షలు , వాల్తైర్ క్లబ్ రూ.5లక్షలు, చిరుకూరి ఎస్టేట్ అధినేత చిరుకూరి శ్రీనివాస్ రూ. 2లక్షలు, సాయనాస్ కన్స్ట్రక్షన్ నుంచి ఎల్. రామారావు , ఎస్. శ్రీనివాసులు రూ. 1లక్ష , రాక్ డేల్ హోటల్ , వెంగమాంబ స్టోన్ క్రషర్ నుంచి శ్రీనివాస్ , ఆదిశేషయ్యలు సంయుక్తం గా రూ.1 లక్ష ,హనీ గ్రూప్స్ అధినేత ముక్కా ఓబులరెడ్డి రూ.1లక్ష చొప్పున మొత్తం రూ.20 లక్షల రూపాయలను చెక్ రూపంలో విశాఖ ఎంపీ సమక్షంలో విశాఖ నగర కమిషనర్ ఆర్.కే.మీనా కు, ఆయన కార్యాలయం లో అందజేశారు. ఈ మొత్తాన్ని పోలీసు అవసరాలకు వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ పోలీసు లు విధినిర్వహణలో చూపుతున్న చొరవను అభినందించారు. వారికి వెన్నుదన్నుగా నిలిచి , ఇతోధికంగా తోడ్పాటు నివ్వాలని పిలుపునిచ్చారు. నగర పరిధిలో సీపీ మీనా చేపడుతున్న కరోన నియంత్రణ చర్యలను అభినందించారు
No comments:
Post a Comment