Followers

కంటోన్మెంట్ జోన్లలో  పటిష్టమైన చర్యలు.


కంటోన్మెంట్ జోన్లలో  పటిష్టమైన చర్యలు.



జిల్లా కలెక్టర్  వినయ్ చంద్

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 


జిల్లాలోని  కంటోన్మెంట్   జోన్లలో  పటిష్టమైన చర్యలు  చేపట్టామని  జిల్లా కలెక్టర్  వినయ్ చంద్  తెలిపారు.  జిల్లాలో  తీసుకుంటున్న  ప్రత్యేక చర్యల పై  గురువారం ప్రకటన విడుదల చేశారు. పట్టణంలో 6 గ్రామీణ ప్రాంతంలో ఒకటి మొత్తం జిల్లాలో 7 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయన్నారు. ఇంటింటి సర్వే చేపట్టామని కరోనా వైరస్ అనుమానితులను కోరం టైన్   హోమ్ తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. నగరంలో తాటి చెట్ల పాలెం అక్కయ్యపాలెం అల్లిపురం ప్రాంతాలు రెడ్ జోన్లుగా  ప్రకటించి  కట్టుదిట్టమైన  చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. రెడ్ జోన్ అమలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు  ఇల్లు విడిచి వెళ్లకుండా  ఇతరులు రాకుండా రహదారులను మూసి వేశామని తెలిపారు. కోవిడ్19పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహని  బుధవారం సాయంత్రం  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని   ఆమె సూచనలు మేరకే   కంటోన్మెంట్ జోన్లలో  సర్వేలు జరుగుతున్నాయని అన్నారు. కరోనా ని జయించిన నలుగురు  నగరంలో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్19 పూర్తిస్థాయిలో నిర్మూలన అయిన  ముగ్గురు  బుధవారం డిస్చార్జ్ అయ్యి  ఇళ్లకు వెళ్లారు. మరో కేసు  వారం క్రితమే  వెళ్లారని  వీరు  పద్మనాభం మండలం  రేవడి  గ్రామం  ఒకే కుటుంబానికి చెందిన  ఇద్దరు.  అల్లిపురంకి  చెందిన ఇద్దరు  డిశ్చార్జి కాగా 16 కేసులు   నెగటివ్  రావాల్సి ఉందన్నారు. కరోనా మహమ్మారి  రెండో  స్టేజి లో  ఉందని  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్ వినయ్ చంద్  కోరారు.


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...