Followers

కరోనాపై రావులపాలెం పోలీసులు విన్నూత్న ప్రచారం


 


 






ఇంట్లో ఉండండి దేశాన్ని కాపాడండి

 

కరోనాపై రావులపాలెం పోలీసులు విన్నూత్న ప్రచారం

 

రావులపాలెం, పెన్ పవర్ : కోణాల వెంకటరావు 

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు కేంద్రం పిలుపుమేరకు అన్ని వర్గాల ప్రజలు లాక్ డౌన్ పాటిస్తుండగా దీని అమలుకు పోలీసులు చేస్తున్న కృషి అందరి మన్ననలు పొందుతుంది. గత నెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కార్యక్రమాన్ని రావులపాలెం మండలంలో విజయవంతం చేసేందుకు స్థానిక పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రజలకు స్నేహపూర్వకంగా కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్ డౌన్ కార్యక్రమం అవసరాన్ని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో 16 వ, నెంబరు జాతీయ రహదారిపై అక్షర రూపంలో స్టే హోమ్ నినాదాలతో అవగాహన కల్పించారు. అంతేకాకుండా స్టే హోమ్.. సేవ్ ఇండియా.. ఇంట్లో ఉండండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదాలతో ఏర్పాటు చేసిన భారీ బెలూన్లు ఆకట్టుకుంటున్నాయి. సి.ఐ వి.కృష్ణ ఆదేశాలతో ఎస్సై పి.బుజ్జిబాబు, అదనపు ఎస్సై హరికోటి శాస్త్రి తదితరుల పర్యవేక్షణలో వీటిని రావులపాలెం సెంటర్లో ఉన్న భవనాలపై ఏర్పాటు చేశారు.



 

 




 

2 Attachments


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...