Followers

నిబంధనలు అతిక్రమిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవు.

 



నిబంధనలు అతిక్రమిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవు.



  నగర పోలీస్ కమిషనర్  ఆర్కె మీనా.



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం ( పెన్ పవర్)


కరోనా లాక్ డౌన్  లో భాగంగా ప్రభుత్వ నిబంధనలను అల్లం గీస్తే  కఠిన చర్యలు తప్పవని  విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా హెచ్చరించారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో  నగరంలో ప్రజలు  నిబంధనలను తూచా పాటించాలని  కోరారు. కరోనా మహమ్మారి  నియంత్రణలో భాగంగా  కట్టుదిట్టమైన  చర్యలు అమలు చేస్తున్న  ప్రజలు సహకరించడం లేదని  విచారం వ్యక్తం చేశారు. నిత్యావసరాల కోసం కొంత టైం వెసులుబాటు కల్పిస్తే ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వాపోయారు.  ఈనెల 1వ తేదీ  ఆరు గంటల నుంచి రెండవ తేదీ 6 గంటల వరకు 150 కేసులు నమోదు చేశామన్నారు.  3వందల డబ్భై ఎనిమిది మంది  అరెస్టు చేశామని తెలిపారు 206 వాహనాలను సీజ్ చేసి అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగిందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. నగరంలో నిబంధనలు  అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  జిల్లాలో కరోనా కేసులు  పెరుగుతున్నాయని  రెండు రోజుల్లోనే 14 చేరాయని   అందువల్ల  ప్రజలు  ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇళ్ల కే పరిమితం కావాలని ఆర్కె మీనా సూచించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...