తోట గోపి యూత్ ఆధ్వర్యంలోకూరగాయలు పంపిణీ
పెంటపాడు, పెన్ పవర్ : రాము
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో తోట గోపి యూత్ ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు కూరగాయలు నిత్యవసర వస్తువులు, శానిటైజర్ ఇంటింటికి పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పని లేక ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ సాయం చేయడానికి ముందుకు వచ్చిన తోట గోపి యూత్ సభ్యులను పలువురు అభినందించారు. కరోనా వైరస్ అనే మహమ్మారి చైనా నుంచి భారతదేశంలో ప్రవేశించిందని ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని, ఎవరి ఇళ్లలో వారు కుటుంబంతో హాయిగా ఉండాలని అన్నారు.ఎవరి ఇంటి వద్ద వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా ఉండాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోటగోపి తనయుడు తోట రాజాబాబు, గంధం సతీష్, జాలాది అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ లు చోడగిరి చినబాబు, అల్లాడి వెంకటేశ్వరరావు, పీతల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీమల్లెల ప్రసాద్, గ్రామస్తులు పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, పొట్ల ఏడుకొండలు, తదితర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment