Followers

కొండ పై నివసించే కొండరెడ్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ



 


పెన్ పవర్, కూనవరం


ప్రకృతిని ఆరాధ్య దైవంగా భావించి గుట్టలపైనే  ఆవాసాలు ఏర్పరుచుకుని జీవించే కొండరెడ్లు కరోనా వైరస్  మహమ్మారి ఎక్కడ సోకుతుందెమొనని గుట్టపై నుండి క్రిందకు రాకుండా ఆవాసాలకే పరిమితం అయ్యారు. నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులకు గురవుతుండం గమనించిన కూనవరం మీడియా  ఆధ్వర్యంలో  మంగళవారం నాడు ముఖ్యఅతిథిగా చింతూరు పిఓ ఆకుల వెంకటరమణను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీడియా మిత్రులు  ముందుకు వచ్చి  తమ వంతుగా కొండరెడ్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతుగా పేదవారికి సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన బ్లాక్ డౌన్ కార్యక్రమని ప్రతి ఒక్కరూ తమంతట తాముగా స్వీయ నిర్బంధం  పాటించినట్లయితే కోవిడ్ 19ని మనదేశం నుండి మన పట్టణం నుండి మన గ్రామం నుండి తడిమివేయడంలో  భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినట్లయితే గ్రామ వాలంటరీలకు వెంటనే సమాచారం తెలియపరచాలని, ఎవరైనా జలుబు, దగ్గు, ఆయాసం,  తుమ్ములు వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను 20సెకన్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి, బయటి నుంచి ఇంటికి వచ్చినట్లయితే ముందుగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికి వెళ్లాలని తెలిపారు. వి.ఆర్.పురం సాక్షి రిపోర్టర్ అశోక్ స్వచ్ఛందంగా కొండరెడ్లకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ కె వి ఎల్ నారాయణ, ఎంపీడీవో సత్యనారాయణమూర్తి, ఎస్సై గుణశేఖర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ చారి, మీడియా మిత్రులు సాక్షి రిపోర్టర్ కోట బాబురావు, ఏబీఎన్ సత్యనారాయణ, విజన్ యండి భాష,ఆంధ్రభూమి బెల్లంకొండ లోకేష్, పెన్ పవర్ వేమన సతీష్, విశాలాంధ్ర నెల్లూరు రమేష్, కోస్తా సమయం గడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...