మధురవాడ, పెన్ పవర్ ప్రతినిధి సునీల్
వారందరూ ఒకే విద్యాలయంలో విద్యనభ్యసించిన స్నేహితులు, ఆ ఉన్నత పాఠశాలలో చదువు పూర్తయి ఇప్పటికి 19 సంవత్సరాలు గడుస్తున్నా ఆపదలో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సాయం చేసి నీ వెనక మేమున్నామంటూ భరోసా ఇచ్చారు ఆ మిత్రులు. వారెవరో కాదు మధురవాడ చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన 2001-2002 పూర్వ విద్యార్థులు. తోటి స్నేహితుడైన రేవళ్ళపాలెం కు చెందిన రాయన రామారావు భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నాడు, అతనికి ప్రమాదవశాత్తూ కాలుకి గాయం కావడంతో గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యాడు, అది తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఆదివారం అతన్ని పరామర్శించి, 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కష్టకాలంలో తోటి స్నేహితుడిని ఆదుకున్న చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు చెందిన 2001-2002 పూర్ణ విద్యార్థులను రాయన రామారావు కుటుంబ సభ్యులే కాక ఊరి పెద్దలు అభినందించారు.
No comments:
Post a Comment