మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలి
విజయనగరం, పెన్ పవర్
.... రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, లాక్ డౌన్ సమయంలో కూడా స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి అండగా నిలిచారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం నాడు నగరపాలక సమావేశ మందిరంలో జరిగిన వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం క్రింద పొదుపు సంఘాల మహిళలకు చెక్కులను అందజేశారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మహిళా సంఘాల సభ్యులకు మా స్కూలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ విపత్కర పరిస్థితులలో మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది అన్నారు. తన పాదయాత్రలో మహిళల కష్టాలను చూసి వారి ఆర్థిక పురోగతికి నవరత్నాల హామీల లో భాగంగా వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేశారన్నారు. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా స్వయం సహాయక సంఘాలు 2019 నుంచి 2020 వరకు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ 1,400 కోట్ల రూపాయలను మహిళల తరపున ప్రభుత్వమే బ్యాంకులో జమ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు లబ్ధి చేకూరిందని, 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయూతనిచ్చింది అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన దగ్గరనుంచి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారన్నారు. యావత్ దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రి గా నిలిచి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కె చెల్లిందని అన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన మహిళా రిజర్వేషన్ చట్టం, దిశా చట్టం లాంటి అనేక ప్రజా ఉపయోగ పథకాలను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. విజయనగరంలో నగరపాలక పరిధిలో ఉన్న 4953 మహిళా సంఘాలకు ఐదు కోట్ల 60 లక్షల 76 వేల 814 రూపాయలను వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద జమ చేయడం జరిగిందన్నారు. విజయనగరం మండల పరిధిలో ఉన్న 923 మహిళా పొదుపు సంఘాలకు 58 లక్షల 82 వేల అ 741 రూపాయలను సున్నా వడ్డీ పథకం కింద జమ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. గత తెలుగుదేశం పాలనలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బూటకపు మాటలు చెప్పడం వల్ల అనేక పొదుపు సంఘాలు అర్హత కోల్పోయారన్నారు. అంతకుముందు నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించేందుకు వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఉపకరిస్తుంది అన్నారు. మండల అభివృద్ధి అధికారి చైన్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సున్నా వడ్డీ పథకం నిధులు నేరుగా మహిళల ఖాతాలోకి జమ అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులతో పాటు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment