వీరు సురక్షితులా..?
వీరికి తప్పక చేయాలి ..
కరోనా రాపిడ్ పరీక్షలు..
(పెన్ పవర్ ప్రతినిధి-విజయనగరం)
విజయనగరం జిల్లాలో
అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దులను మూసి వేశాం. పటిష్ట భద్రతా చర్యలు వల్ల విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా కృషి చేసాం. కానీ కరోనా రాపిడ్ పరీక్షల విషయంలో కాస్తా వెనక బడ్డాం. అయినప్పటికీ ప్రస్తుతానికి విజయనగరం పరిస్థితి రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే చాలా మెరుగ్గానే ఉంది. అయితే ఒక చిన్న అనుమానం ప్రజల మనసును తొలుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, వారితో పాటు మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉందన్న ఆలోచనతో కరోనా విషయంలో క్షేత్ర స్థాయిలో మాకు కనిపించిన ఒక అంశాన్ని, ఆలోచనను అధికార యంత్రాంగం ముందుకు తీసుకువస్తున్నాం..!!
విజయనగరం జిల్లా మీదుగా, సరిహద్దుల వెంబడి ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు నిత్యావసర సరుకులతో పాటు ఇతరాత్ర గూడ్స్ ని రవాణా చేసే ట్రక్కులు, లారీలు, కంటైనర్లు, వ్యాన్లు వంటి వాహనాలు నిత్యం తిరుగుతున్నాయి. ఇటీవల లాక్ డౌన్ నుంచి వీటికి సడలింపు ఇవ్వడం ద్వారా ఈ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఒక విధంగా తప్పనిసరైనప్పటికీ, చిన్న అజాగ్రత్త వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం కనిపిస్తోందనిపిస్తోంది.
ఆయా ప్రాంతాల్లో రహదారుల వెంబడి ఉండే టీ దుకాణాలు, మెడికల్ షాప్ లు, చిన్న చిన్న చిల్లర దుకాణాలు లాక్ డౌన్ సడలింపు సమయాల్లో తెరచి ఉంటున్నాయి. వీటిల్లో టీ దుకాణాలు తెల్ల వారి జాముల్లోనూ, మెడికల్ షాప్ లు 24/7 తెరచి ఉంచుతున్నారు. అక్కడక్కడ పల్లెల్లో రోడ్ వెంబడి చుట్ట, బీడీ, సిగరెట్లు అమ్మే చిల్లర దుకాణాలు కూడా తెరిచే ఉంటున్నాయి. అయితే ఇతర జిల్లాలు, అంతరాష్ట్రాల నుంచి గూడ్స్ తో ప్రయాణిస్తున్న వాహనాలు మన జిల్లాలోని రహదారుల గుండా ప్రయాణించేటప్పుడు వాటి డ్రైవర్లు, సిబ్బంది అక్కడక్కడ, అప్పుడప్పుడు ఆయా చోట్ల తమ అవసరాలను బట్టి వాహనాలు నిలిపి ఆయా దుకాణ దారులు వద్ద కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే అలా తమ వద్దకు వచ్చే వారు ఎవరు, ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారు సురక్షితులా కాదా ఆని దుకాణ దారులు, మెడికల్ షాప్స్ వారికి తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే అలా ప్రయాణిస్తూ వస్తున్న ఈ వాహన డ్రైవర్లు, క్లీనర్ల వల్ల కరోనా వైరస్ ప్రబలు తుందేమోనన్న ఆందోళన ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.
ఆయితే అలా వచ్చిన లారీ డ్రైవర్లు, క్లీనర్ లను పట్టుకొని వారికి కరోనా రాపిడ్ పరీక్షలు చేయడం కష్ట సాధ్యమయ్యే పని. అలాగని వారికి ఏమీ లేదు, వారు సురక్షితులనే గ్యారంటీ ఇచ్చి వదిలేయనూ లేం. అయితే ఇప్పటి వరకు తీసుకున్న లాక్ డౌన్ మేజర్మెంట్స్ లో ఈ అంశానికి ప్రాధాన్యత లేకపోయి కూడా ఉండవచ్చును. కానీ అసలైన అప్రమత్తత ఇక్కడే ఎక్కువ తీసుకోవాలనిపిస్తోంది.
అందుకోసం అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల రహదారుల వెంబడి ఉండే చిల్లర దుకాణాలు, టీ దుకాణాలు, దాభాలు, మెడికల్ షాప్స్ ల్లో ఉండే వారిని గుర్తించి వారికి వెంటనే కరోనా రాపిడ్ పరీక్షలు చేయించాలి. అటువంటి వాటిని పూర్తిగా మూసి వేయడం లేదా, వారికి కరోనా పట్ల పూర్తిగా అవగాహన కల్పించడం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేస్తున్న..కరోనా మాదిరిగానే ప్రపంచాన్ని కబళించిన హెచ్ఐవి(ఎయిడ్స్) వైరస్ కూడా మన దేశంలో ఎక్కువగా రవాణా వ్యవస్థ ద్వారానే వ్యాప్తి చెందిన విషయం మనకి విదితమే. దూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్లు, సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా ఈ హెచ్ఐవి వైరస్ వ్యాప్తికి అప్పట్లో ప్రధాన కారకులైనట్టు గణాంకాలు చెప్పేవి.
ఇప్పుడు అంత కంటే ప్రమాద కరమైన కరోనా వైరస్ కూడా రవాణా వ్యవస్థ ద్వారానే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని గుర్తించే ముందు చూపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, ప్రయివేటు రవాణా వ్యవస్థలను లాక్ డౌన్ మేజర్మెంట్స్ లో భాగంగా నిలిపి వేశారు. తద్వారా వైరస్ చైన్ లింక్ ను కూడా తెంపే ప్రయత్నం చేశారు. అయితే రెండు వారాల లాక్ డౌన్ లో ప్రజల నిత్యావసర సరుకులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, తద్వారా ప్రజల ఇబ్బందులు పడడం, రైతుల రబీ పంట ఉత్పత్తులు కూడా రవాణా లేక నష్టాల పాలవుతున్నట్టు గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గూడ్స్ లారీల రాకపోకలకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోడ్డెక్కిన గూడ్స్ లారీలు రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తున్నాయి. అలా ప్రయాణ క్రమంలో లారీ డ్రైవర్లు, క్లీనర్ల్ వల్ల కరోనా వైరస్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపిస్తుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వైరస్ వాహకులుగా అనుమానించినప్పటికీ, మనం వారిని కట్టడి చేయలేం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రహదారుల వెంబడి చిల్లర దుకాణాలు, టీ దుకాణాలు, మెడికల్ షాప్స్ వారికి ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కరోనా రాపిడ్ పరీక్షలు చేయించాలి. కరోనా పాజిటివ్ గుర్తించినట్టైతే వారిని కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడం ద్వారా ఆదిలోనే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేస్ కూడా నమోదు కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉన్న యంత్రాంగం ఈ విషయమై కూడా ఒకసారి దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
No comments:
Post a Comment