లాక్ డౌనను నిబంధనలను ఉద్యోగులు కూడా పాటించాల్సిందే
- విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఐ.పి.ఎస్.,
విజయనగరం, పెన్ పవర్
విజయనగరం పట్టణంలో కోవిద్ - 19 వైరస్ పై పోరాటానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌను నిబంధనలను
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి
02-04-2020 ది, శుక్రవారం నాడు స్పష్టం చేసారు.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాధి ప్రబలకుం డా
ఉండేందుకే లాక్ డౌన్ ను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ
హెచ్చరించారు.
లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బంది పడకూడదని, వస్తువులను కొనుగోలు చేసుకొనేందుకు సదలింపులను
ఇవ్వడం జరిగిందన్నారు. కానీ, కొంతమంది వ్యక్తులు అవసరమున్నా లేకపోయినా మోటారు సైకిళ్ళుపై ఊరు మీద
తిరుగుతున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులను ఇకపై ఉపేక్షించ వద్దని, దొరికిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు
చేయాల్సిందిగా పోలీసు అధికారులును జిల్లా ఎస్పీ ఆదేశించారు.
లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలను అందించే
శాఖలకు మినహాయింపునివ్వగా చాలా మంది అదే పనిగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు తిరుగుతున్నారన్నారు.
అటువంటి వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆమె అదేశించారు.
విశాఖపట్నం, శ్రీకాకుళం,
ఒడిస్సా రాష్ట్రాల నుండి విజయనగరం జిల్లాకు వచ్చే అన్ని వాహనాలను అత్యవసర పరిస్తితుల మినహా నిలుపుదల
చేయాలన్నారు.
అత్యవసర సమయాల్లో మోటారు సైకిల్ పై ఒక్కరు, కారులు, ఆటోల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు.
చెక్ పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఏ శాఖకు చెందిన వారైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. లాక్ డౌన్లో ప్రజలకు సేవలందించే పేరుతో చాలా మంది
అవసరం లేకపోయినా తిరుగుతున్నారని, అటువంటి వారిని కూడా నిలిపేయాలన్నారు.
ఎవరికైనా సహాయం చేయాలని,
భోజనాలు సమకూర్చాలన్న ఉద్దేశ్యం ఉంటే సంబంధిత డిఎస్సీ వద్ద ముందుగా అనుమతి పొందాలన్నారు. సంబంధిత
డిఎస్పీ అనుమతించిన సమయంలో, అనుమతించిన నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే వారు సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అదే
విధంగా మోటారు సైకిలుపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాల్సిందిగా ఆమె సూచించారు.
కోవిద్ 19 గురించి అసత్య వార్తలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో సర్కులేట్ చేసే వారిపై కేసులు నమోదు చెయ్యాలన్నారు. ఇటువంటి
వార్తల వలన ప్రజలు మరింత భయాందోళనకు గురవుతారన్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించి, పోలీసు శాఖకు
సహాయపడాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్సీ కోరారు. అదే విధంగా 100శాతం లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాల్సిందిగాను, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదేశించారు.
No comments:
Post a Comment