హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్
వితరణ
మధురవాడ, పెన్ పవర్ రిపోర్టర్ సునీల్,
హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ మధురవాడ వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆశ్రమం వద్ద నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అహ్మద్ గారు పాల్గొని అభాగ్యలకు కూరగాయలు, పప్పులు తదితర దినసరి వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. పోలీసులకు సహకరిస్తూ లాక్ డౌన్ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాషా మొహిద్దీన్, గాలిబ్, జలాల్ బాషా (హీరు), సుధీర్, సంతోష్, ప్రసాద్, తాజ్, వినయ్, వెంకీ, యాసీన్, రిషి, రాము, మస్తాన్, నాగరాజు, రాజుగారు, మురళి మరియు అక్షర భాను ఎడిటర్ పిల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు....
No comments:
Post a Comment