పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు
పెన్ పవర్;జమ్మలమడుగు
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో రోజు కూలి పనులకు వెళ్లే వ్రృద్దులకు ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండటంతో తినడానికి కూడా తిండి దొరకని వారికి,అనాధలకు ,వికలాంగులకు జమ్మలమడుగు లోని తొగటవీరక్షత్రియసంఘం మరియు శ్రీ చౌడేశ్వరి దేవాలయం వారి ఆద్వర్యంలో పట్టణం లోని BC కాలని,చౌడమ్మ గుడి,మోరగుడి,గూడుమస్తాన్ దర్గా ,నారాపురం దేవాలయం పరిసరాల్లో ఉన్న పేదవారికి అన్నం,పప్పు,రసం,మంచి నీరు ప్యాకేట్ల పంపిణీ చేశారు, ఈ అన్నదానం ఏప్రిల్ 1నుండి లాక్ డౌన్ చివరి తేదీ అయిన ఏప్రిల్ 14 వరకు ప్రతి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ అన్నదానం కి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమంలో బి. పాండులు,భాస్కర్ ,కవలా రామయ్య,పుణ్యమూర్తి,చంద్రగోవిందు, సీ జే పాండు, సీ జే కొండయ్య, గంజికుంట తిరుమలదాసు ,గొరిగె జ్యోతి ప్రసాద్, మోరగుడి గ్రామ వాలంటీరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment