కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం - ప్రధాన వైద్యులతో మంత్రుల సమీక్ష
( నెల్లూరు జిల్లా రిపోర్టర్, పెన్ పవర్ గోశాల ప్రసాద్ )
కరోనా వైరస్ పై అధికారులతో పాటూ తామూ అప్రమత్తంగా ఉన్నామని మంత్రులు డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం వారు నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. వారితో పాటూ జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, కోవిడ్ నోడల్ అధికారి బాపిరెడ్డి కూడా ఉన్నారు. కళాశాల పరిశీలన అనంతరం మంత్రులు ప్రధాన వైద్యులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ రోగులకు అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో సదుపాయాలను పెంచాలని సూచించారు. ఇప్పటికే 32 పాజిటివ్ కేసులు ఉన్నాయని చెబుతూ ఇంకా ఎన్ని రిపోర్టులు రావల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment