విలేకరులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేసిన జనసేన సైనికులు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం 79 వ వార్డ్ కార్పొరేటర్ జనసేన అభ్యర్థి అయిన కింతాడా ఈశ్వరరావు సొంత నిధులతో మండలం లోని ప్రిన్ట్ మరియు ఎలక్ట్రానిక్ విలేకరులకు నిత్యావసర సరుకులు,కూరగాయలను పంపిణీ చేశారు.బుధవారం సాయంత్రం జివిఎంసి పరిధిలోని లంకెలపాలెం లో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు విలేకరులకు నిత్యావసర వస్తువుల ను అందించి న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతు.ప్రపంచ మంతా కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న తరుణంలో సామాన్యులకు కూడా ప్రపంచంలో ని దేశం లోని కరోనా విషయాలు ఎప్పటి కప్పుడు తెలియ చేస్తూ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునేలా చేతన్య వంతులను చేసే గురుతర భాద్యతను నిర్వహిస్తోంది మాత్రం మీడియానే అని అన్నారు. దేశం లో లాక్ డవున్ ఉన్న పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ,పారిశుద్ధ్య కార్మికులు లతో పాటు మీడియా చేస్తున్న కృషి ప్రశంసనీయం అని అన్నారు.ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా బారిన పడకుండా తీసుకోవలిసిన జాగ్రత్తలు తమ వార్తల ద్వారా చెపుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో వుండే ఒకే ఒక వ్యవస్థ మిడియానే అని ప్రశoశించారు.మీడియా మిత్రులు ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా కష్ట పడుతున్నారు అని వారి సేవలను రాజకీయ ప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎప్పటికి మర్చి పోలేరు అని ఆయన అన్నారు.లాక్ డవున్ వల్ల
ఉపాధి కోల్పోయిన నిరుపేదల తో పాటు మీడియా వారికి తాను చేయగలిన దానిలో సాయంగా నిత్యావసర సరుకుల ను అందిచడం జరిగింది అన్నారు.79 వవార్డు అగనంపూడి,లంకెలపాలెం, దేశాపాత్రుని పాలెం లో ప్రతి ఇంటికి జనసేన సైనికులు తమ వంతు బాధ్యతగా వారి వ్యక్తిగత నిధులు వెచ్చించి కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది అని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో సర్వసిద్ధ సన్యాసి రాజు,పిల్లి శివకృష్ణ,నక్క శ్రీనివాస్,రాయి రమణ,గంటల రామారావు,కాంతారావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment