Followers

అంబేద్కర్ ఆశయ సిద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలి


విజయనగరం, పెన్.పవర్ : డేవిడ్ రాజ్


 


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సిద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. మంగళవారం నాడు గాజులరేగ రాళ్ల వీధిలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలు లో లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. న్యాయవాదిగా, భారత రాజ్యాంగాన్ని రాసిన ప్రధాత గా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. శంకర్రావు, కార్పొరేట్ అభ్యర్థులు నడి పిల్లి ఆదినారాయణ, kanukula తేజశ్రీ, పట్టా ఆదిలక్ష్మి, జమ్ము మధు, అట్టాడ శ్రీను తదితరులు ఉన్నారు....


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...