Followers

కూరగాయలను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బండారు


నాయుడు పాలెం గ్రామంలో 1200 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బండారు



             పరవాడ పెన్ పవర్



కరోనా కారణంగా కష్టాలను చవిచూస్తున్న నాయుడు పాలెం ప్రజలకు మీకు నేనున్నా అంటూ మాజీ ఎంపిటిసి కూoడ్రపు శ్రీరామమూర్తి ఏర్పాటు చేసిన కూరగాయలను ముఖ్య అతిధిగా పాల్గొని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చేతుల మీదగా పంపిణీ చేశారు.అనంతరం సత్యన్నారాయణ మూర్తి మాట్లాడుతూ గత 16 రోజులుగా కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలకు ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులు పడతుండటమే కాక నిత్యావసర వస్తులకు బయటకు భయపడుతూ వెళ్ళవలసి పరిస్తుల్లో ఎదుర్కొంటున్నారు అని అన్నారు.ప్రభుత్వాలు చేసే సహాయం ఎటూ చాలక ఎమ్ చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నపుడు వారి ఇబ్బందులను గమనించి ఆదుకున్న వాడే నిజమైన నాయకుడు అని ఆ కోవకు చెందిన నాయకుడే శ్రీరామమ్మూర్తి అని బండారు ప్రశంసించారు.మూర్తి తన వ్యక్తిగత నిధులు వెచ్చించి 1200 వదల కుటుంభాలకు రకానికి కేజీ చొప్పున 7 రకాల కూరగాయలను ఈ రోజు పంపిణీ చేయడం జరుగు తోంది అని తెలిపారు.నిత్యావసర వస్తులకోసం కూడా ప్రజలను బయటికి వెళ్లకుండా చేయగలిగితే ప్రజలను కరోనా భారిన పడకుండా కాపాడ వచ్చు అనే సదుద్దేశం తో మూర్తి ఈ కార్యక్రమం చేపట్టారు అని బండారు తెలిపారు.ప్రజలు కూడా కరోనా వ్యాప్తి నివారణ కొరకు వారి ఇళ్లలోనే ఉండి ప్రభుత్వాలకు,పోలీసు అధికారులకు,అహర్నిశలు శ్రమిస్తున్న డాక్టర్ల కు సహకరించాలి అని కోరారు.ఎవరికి అయినా జలుబు,దగ్గు,జ్వరం లాంటివి ఉంటే వెంటనే వారు స్వయంగా ఆరోగ్య సిబ్బందికి తెలియ చేసి తగిన పరిక్షలు చేయించుకోవాలి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూండ్రపు సన్యాసినాయుడు,సినియర్ టిడిపి నాయకులు పయిల అప్పలనాయుడు,కూండ్రపు ప్రసాద రావు,కూండ్రపు కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...