కోవిడ్ ఆసుపత్రులలో పనిచేయుటకు స్టాప్ నర్సుల నుండి దరఖాస్తులు ఆహ్వనం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యస్.వి.రమణకుమారి
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
కేంద్ర ప్రభుత్వము కోవిడ్ 19 ను జాతీయ విపత్తుగా గుర్తించిందని, తగు నివారణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడమైందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యస్.వి.రమణకుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి వారి కోవిడ్ ఆసుపత్రులలో అత్యవసర చికిత్సా విభాగంలో రెండు సంవత్సరములు పనిచేయుటకు అనుభవజ్నులైన స్టాప్ నర్సుల నుండి దరఖాస్తులు ఆహ్వనించుచున్నామన్నారు. బిఎస్సి నర్సింగ్/జిఎన్ఎం అర్హత ఉండాలని, తమ ధరఖాస్తులతో పూర్తి దృవీకరణ పత్రాలు జతపర్చి జిల్లా కేంద్ర మహారాజ ఆసుపత్రికి ఈనెల 23వ తేదీలోపు కార్యాలయపు పనివేళలలో సామాజిక దూరము పాటిస్తూ సమర్పించాలన్నారు. పూర్తి వివరాల కొరకు www.vizianagaram.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు.
No comments:
Post a Comment