Followers

మద్యం నిల్వలపై కమ్ముకుంటున్న నీలి నీడలు



జనతా  కర్ఫ్యూ తో  మూతపడ్డ మద్యం షాపులు. సర్కారు దుకాణాల్లో ఓబిల పై అనుమానాలు.?

(స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్  మజ్జి శ్రీనివాస మూర్తి )


సర్కారు మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలపై నీలి నీడలు  కమ్ముకుంటున్నాయి. దుకాణాల్లో మద్యం  స్టాక్ లు    యధావిధిగా  ఉన్నాయా?  లేక గోల్ మాల్ ఏమైనా జరిగాయా? అన్న అనుమానాలు  రేకెత్తిస్తున్నాయి.  అక్కడ అక్కడ  వెలుగు చూస్తున్న  సంఘటనలే  బలం చేకూరుస్తున్నాయి. జిల్లాలో   300 వరకు  ప్రభుత్వ మద్యం దుకాణాలు  నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి  నియంత్రణలో భాగంగా  మార్చి 22న  ప్రభుత్వం  జనతా   కర్ఫ్యూని  విధించారు. ఆ మరుసటి  రోజు నుంచి  లాక్ డౌన్  ప్రకటించారు. ఈ నేపథ్యంలో  ప్రభుత్వ మద్యం దుకాణాలు  మార్చి 21  సాయంత్రం   మంచి  మద్యం షాపులు  మూతపడ్డాయి. ఆ రోజుకి  దుకాణాల్లో  ఉన్న  స్టాకులు   మరలా షాపులు తెరుచుకునే  వరకు  నిల్వలు  ఉండితీరాలి. కానీ  దుకాణాల్లో  ఆ మెరా  మద్యం స్టాకులు  ఉన్నాయా?   అన్నది  అధికారుల కె ఎరుక.  కర్ఫ్యూ కారణంగా  మందు  దొరక్క  మందుబాబులు  అల్లాడిపోతున్నారు. కిక్కు కోసం  ఎంత ధరైనా చెల్లించి  మత్తు ని కొనుక్కోవాలని  చూస్తున్నారు. మద్యానికి బానిసైన  మందు బాబులు  మద్యం ధరలను చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో  మద్యం   మాయం  అవుతుందని  ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మద్యం షాపులు  సేల్స్ మెన్లు సూపర్వైజర్లు ఆధీనంలో  ఉన్నట్లు సమాచారం.
రాజమండ్రి  ప్రాంతంలో మద్యం షాపులో  మద్యం మాయం అయిందని  ఒక  కానిస్టేబుల్ను  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
విజయనగరం  సుంకర పేట  మద్యం షాపు లో  అర్ధరాత్రి దొంగలు పడి  10 కేసుల మద్యం  తస్కరించి న  విషయం విధితమే. ఇలా   మద్యం మాయమవుతున్న  సంఘటనలు  పునరావృతం అవుతున్నాయి.  జిల్లాలోని   గ్రామీణ ప్రాంతాల్లో  నడుస్తున్న  ప్రభుత్వ మద్యం దుకాణాల  మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు సైతం  షాపుల వైపు  పట్టించుకున్న దాఖలాలు లేవు. షాపుల నిర్వాహకులు   ఆయా ప్రాంతాలకు చెందిన వారు  కావడం గమనార్హం. అక్కడక్కడ  మందుబాబులు   గొంతు   తడుపు కుంటున్న సంఘటనలు లేకపోలేదు. ప్రభుత్వ మద్యం దుకాణాలపై  ప్రత్యేక  నిఘా  ఉంచాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.  జిల్లాలో  మద్యం దుకాణాల్లో  స్టాకుల వ్యవహారం పై విశాఖ ఎక్సైజ్ సూపరిండెంట్ ను  ఫోను ద్వారా వివరణ కోరేందుకు  ప్రయత్నించగా  ఆయన అందుబాటులో లేరు.


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...