ఆటా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
ఎటపాక.పెన్ పవర్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకుగానూ భారతదేశ ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడాన్ని బట్టి ఎటపాక మండల పరిధిలోని పిచ్చుకలపాడు గ్రామపంచాయతీ - గుండం గ్రామంలోని ఆదివాసీలకు ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా నేపధ్యంలో ఆట ఆధ్వర్యంలో గ్రామంలోని ఆదివాసీలకు నిత్యవసర వస్తువులైన కూరగాయలను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ...వైరస్ వ్యాధి గురించి, లక్షణాలు, వ్యాప్తి, మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు మాస్క్ వాడకం, హ్యాండ్ వాష్ - విధానం , భౌతిక దూరం ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఆట రాష్ట్ర నాయకులు పూసం శ్రీను, జిల్లా నాయకులు కణితి రామకృష్ణ, నూప అనిల్, ఆదివాసీ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నాయకులు గుజ్జ సీతమ్మ, సీనియర్ సిస్టర్ పి. అన్నపూర్ణ, హెల్త్ అసిస్టెంట్ పెనుబల్లి గంగరాజు సమానవ్యకర్త మడివి నెహ్రూ, నాయకులు పోడియం హరిబాబు, పండా కిరణ్, పోడియం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment