లాక్‌డౌన్ కొనసాగుతుంది
సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదు
సభలు, సమావేశాలు, మతసంబంధమైన వేడుకలు నిషిద్దం
వైద్య, వ్యవసాయ రంగాలకు పూర్తిగా వెసులుబాటు
కొన్నిరకాల చేతివృత్తిదారులకు అనుమతులు
స్వగ్రామాల్లోనే ఉపాధి పనులు
గ్రామాల్లో భవన నిర్మాణ పనులకు పచ్చజెండా
జిల్లాలో ప్రవేశించే డ్రైవర్లకు వైద్య పరీక్షలు
అన్నిటా భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరం
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
కోవిడ్-19 నివారణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటివరకూ జిల్లా సురక్షితంగా ఉందని, అయినప్పటికీ జిల్లాలో లాక్‌డౌన్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గ్రీన్ జోన్‌లో ఉన్న కారణంగా కొన్ని కార్యకలాపాలకు పూర్తిగా, మరికొన్నిటికి షరతులతో కూడిన వెసులుబాటు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో జీఓ 239పై చర్చించి, కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌లో వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు కల్పించినప్పటికీ, ప్రతీచోటా భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, పనిచేసే చోట చేతులు కడుగుకొనేందుకు నీళ్లు, సబ్బు లేదా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొన్ని రకాల పరిశ్రమలకు దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతినిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రవేశించే డ్రైవర్లకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని చెప్పారు. మద్యం, గుట్కాల విక్రయం చట్టప్రకారం నేరమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతింపబడిన వారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా ఎస్‌పి బి.రాజకుమారిని కోరారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణా చట్టం-2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనుమతులు లేనివి ః
రైళ్లు, బస్సులు, ప్రజా రవాణా, అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల రాకపోకలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కార్యక్రమాలు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, సభలు, సమావేశాలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, మత సంబంధ కార్యక్రమాలు నిషిద్దం.
అనుమతించబడినవి ః
ఆయుష్‌తో సహా అన్ని రకాల ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లీనిక్‌లు, టెలి మెడిసిన్ కేంద్రాలు, మందుల షాపులు, లేబ్స్, కలెక్షన్ సెంటర్స్, ఫార్మసి సెంటర్లు, వైద్య పరిశోధనా కేంద్రాలు, పశువుల ఆసుపత్రులు, క్లీనిక్‌లు, పేథాలజీ లేబ్స్, మందుల తయారీశాలలు, వైద్య పరికరాలు విక్రయించే షాపులు, తయారీ కేంద్రాలు, 108 అంబులెన్స్ తయారీ కేంద్రాలు, ఆరోగ్య సేవా కేంద్రాలు, అత్యవసర సేవలందించే సంస్థలు.
వ్యవసాయ, ఉద్యాన పంటలు మరియు అనుబంధ కార్యకలాపాలు, వ్యవసాయ పనులు, రైతులు, రైతు కూలీల పనులు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కార్యకలాపాలు, మండీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలు, వ్యవసాయ పరికరాల మరమ్మతు, విక్రయించే షాపులు, విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ఉత్పత్తి, విక్రయ కేంద్రాలు, వ్యవసాయ యంత్రాలు తరలింపు. ప్లాంటేషన్ పనులు. 50శాతం కార్మికులతో జీడి పరిశ్రమల్లో ప్రాసెసింగ్, ఉత్పత్తి కి అనుమతి. పిఎసిఎస్ లు, మార్కెట్ కమిటీలు. ఆక్వా పరిశ్రమలు, ఫీడింగ్ తయారీ యూనిట్లు, విక్రయి కేంద్రాలు, హార్వెస్టింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, విక్రయశాలలు, కోల్డ్ స్టోరేజీలు, హేచరీలు, మత్స్య ఉత్పత్తుల తరలింపు. పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి రవాణా, సేకరణ, సరఫరా. పౌల్ట్రీ ఫారాలు, హేచరీలు, లైవ్‌స్టాక్ ఫార్మింగ్‌లకు అనుమతి. పశు దానా ఉత్పత్తి, రవాణా, విక్రయ కేంద్రాలు. గోశాలల నిర్వహణ. సాధారణ పనివేళల్లో బ్యాంకులు, ఎటిఎంలు, ఐటి వెండార్స్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్, ఎటిఎం కేష్ ఆపరేషన్స్ ఏజెన్సీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ కార్యకలాపాలు. బాలల సంరక్షణా కేంద్రాలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, అనాధలు, వితంతువులు, మహిళల సంరక్షణా కేంద్రాలు, జువైనల్ హోమ్స్. ఆన్‌లైన్ టీచింగ్ కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లు. భౌతిక దూరాన్ని పాటిస్తూ గ్రామీణ ఉపాధిహామీ పనులు. ఏ గ్రామంలో వారికి ఆ గ్రామంలోనే పనులు నిర్వహణ. నీటి పరిరక్షణ, చిన్ననీటి పారుదలకు సంబంధించిన పనులు. పనులు జరిగే చోట చేతులు కడుగుకొనేందుకు ఏర్పాట్లు, వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు.
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్‌పిజి పంపిణీ, రవాణా. విద్యుత్ సరఫరా మరియు ఉత్పత్తి.
పోస్టు ఆఫీసులు, టెలీ కమ్యూనికేషన్, ఇంటర్‌నెట్ సెంటర్లు. రక్షణా సంస్థలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎఫ్‌సిఐ, నెహ్రూ యువ కేంద్రాలు.
నీటి సరఫరా, పారిశుద్యం, చెత్త నిర్వహణ సంస్థలు, వ్యక్తులు, సిబ్బంది.
నిత్యావసరాలు, కూరగాయలు ఉత్పత్తి, రవాణా, విక్రయం, సరఫరా వాహనాలు, సిబ్బంది.
స్థానిక పనివారితో జాతీయ రహదారి నిర్మాణ, నిర్వహణ పనులు. నిబంధనలు పాటిస్తూ రైల్వే నిర్వహణా పనులు.
అనుమతించబడిన వ్యక్తులు, వృత్తిదారులు ః అన్ని రకాల వైద్య సిబ్బంది, సైటింటిస్టులు, పశువైద్యులు, నర్సులు, పేరా మెడికల్ సిబ్బంది, లేబ్ టెక్నీషియన్లు, అంబులెన్స్ సిబ్బంది, ఇతర ఆసుపత్రి సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది. అనుమతి పొందిన ఇతర సంస్థల సిబ్బంది. బోరు మెకానిక్‌లు, మోటార్ మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు తదితర వృత్తిదారులు(ఐడి కార్డు తప్పనిసరి)
No comments:
Post a Comment