జగన్ ప్రభుత్వంపై ఆర్థికభారం
-- పరిపాలనలో కరోనా తెచ్చిన అడ్డంకులు
-- అయినా ఆగని సంక్షేమ పథకాలు
-- కష్టకాలంలో ప్రతిపక్షాల విమర్శల రాజకీయాలు
--- భవిష్యత్ పాలన ఎలా ఉంటాది అనేది ఆసక్తి
అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్
ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ఆర్థిక భారం పడింది అంటే ఆశ్చర్యం లేదు. సంక్షేమ పథకాల పెంపు అనే తపనకు కరోనా రూపంలో బ్రేక్ పడింది అనేది వాస్తవం. అయినా ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే కొనసాగిస్తూనే ఉన్నారు. కాని భవిష్యత్తులో ఎలా నెట్టుకువస్తారన్నదె ఇప్పుడు ప్రశ్న. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుడటం కూడా పరిపాలన నిర్వహణ పై ఎలాంటి ప్రభావం చూపుతుందినెది తేలాల్సి ఉంది. నిజానికి జగన్ అధికారం చేపట్టిన అప్పటినుంచి ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అమ్మబడి ,రైతు భరోసా వంటి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అనతికాలంలోనే ప్రజలకు నగదును అందజేశారు. 8 నెలల పాలనతో గాడిన పడుతున్న సమయంలో జగన్ పరిపాలనా ఆలోచనలకు కరోనా వ్యాధి రూపంలో పెద్ద అవాంతరమే ఏర్పడిందనెది చెప్పొచ్చు.
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడెకక్కడ పరిపాలన ఆగిపోయింది. ఎగుమతులు దిగుమతులు లేవు. రవాణా ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం లేనే లేదు. ఇది పక్కన పెడితే అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది పెను భారమే అన్నది విశ్లేషకుల మాట. పైగా ప్రస్తుతం పరిపాలన అంతా కరోనా పైనే దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అవసరం కావడంతో నిధులన్నీ దీని నివారణకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కారణంతో అధికారులు ,పరిపాలన విభాగం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ దీనిపైనే దృష్టి పెట్టారు. మరో ఆలోచనకు అవకాశం లేనంతగా భయాందోళన మధ్య అంతా కొనసాగుతుంది. కేంద్రం దీనికోసమే అంటూ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఖర్చయిపోతునే ఉన్నాయి. గ్రామాలు తదితర అభివృద్ధి నిధులు రాష్ట్రానికి రావాల్సిన ఉన్న భవిష్యత్తులో కేంద్రం ఇస్తాదో లేదో తెలియని పరిస్థితి. దీంతో భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి పై ఎలాంటి ప్రభావం పడుతుందో జగన్ దీనిని ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే అన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచం అంతా వణికిపోతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు రాజకీయాలకు తెర లేపుతుండటం ఇబ్బందికర పరిణామమే. వాళ్లు పెంచే వత్తిడితో ప్రభుత్వం లక్ష్యానికి బదులు పక్కదారి పడితే ప్రజల్లో ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతాది. కరోనా ను ఎదుర్కోవడంలో రాష్ట్రం పై స్థాయిలో నిలిచింది అన్నది గణనీయమైనది. దీనిని అధిగమించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతిని ఏ మేరకు తీసుకెళ్తారనెది ఆసక్తి కలిగిస్తుంది.
No comments:
Post a Comment