Followers

ముస్లిం సోదరులు తగు జాగ్రత్తలు పాటించాలి


రంజాన్ సందర్భంగా  ముస్లిం సోదరులు తగు జాగ్రత్తలు పాటించాలి


ఉపవాసములు, సమాజులు  ఇళ్లలో మాత్రమే చేసుకోవాలి


                                                జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్


         


విజయనగరం,


  రంజాన్ సందర్భముగా ప్రస్తుతం ప్రపంచం లో , దేశం లో, రాష్ట్రం లో, జిల్లా లో నెలకొన్న పరిస్తితి దృష్టిలో పెట్టుకొని ప్రజా ఆరోగ్యము దృష్ట్యా ముస్లిం సోదరలు అందరూ తగు జాగ్రత్తలు తీసుకొంటూ, ఉపవాసములు మరియు నమాజులు అందరూ తమ తమ ఇళ్ళ ల్లో మాత్రమే చేసుకోవాలని జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ సూచించారు.  


  ఈ క్రింది తెలిపిన సూచనలు పాటించవలసినదిగా తెలియచేయడమైనది.


 



  1. ప్రతి మసీదు నందు ఆజాన్ ఇచ్చుటకు మరియు ఉప వాస సైరన్ మోగించుటకు అనుమతించడమైనది.

  2. ప్రతి మసీదు నందు ఇమామ్, మౌజాన్, మాత్రమే పాల్గొనుటకు అనుమతించడమైనది.

  3. ప్రతి మసీదు నందు రంజాన్ గంజి వండుటకు అనుమతి లేదు.

  4. ఉపవాస సాహారి, ఇఫ్తార్ విందులు సామూహికముగా చేసుకొనుటకు అనుమతి లేదు.

  5. తమ ఇళ్ళ లో బందు మిత్రులతో కలసి నమాజు కై జమాతులు ఏర్పాటు చేసుకొరాదు. సాహారి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకోకూడదు.

  6. రంజాన్ 1441 జెజ్రీ(2020)లో కూడా పరాజ్ నమోజులు, రారావి నమాజులు తమ తమ ఇళ్ళ వద్దనే చేసుకొనవలెను.

  7. మసీదుకు హాజరైన ఇమామ్, మౌజాన్, తప్పని సరిగా సామాజిక దూరం పాటించుచూ నమాజు కార్యక్రమం చేసుకొనవలెను.

  8.  ప్రతి మసీదు నందు ఖాతం సాహారి / ఖాతం ఇఫ్తార్, సమయములో ఉపవాస సైరెన్ మోగించుటకు అనుమతి ఇవ్వబడినది, ఆజాన్ కూడా ఇవ్వగలరు.

  9. జఖాత్ విషయములో ఎవ్వరి ఇంటి వద్ద గుమిగూడకుండా, పేదవారిని దృష్టిలో ఉంచుకొని రంజాన్ పండుగ కు మందుగానే లాక్ డౌన్ నిబందనలు పాటించుచూ పేదవారి ఇంటికి అవసరమగు సరుకులు చేరే సౌకర్యం చేయవలసినదిగా కోరడమైనది.


 


          ప్రస్తుత విపత్కర పరిస్థితులలో జిల్లాలోని ముస్లిం సోదరులందరూ పై సూచనలను పాటించి రంజాన్ మాసమును ఆచరించాలని తెలిపారు.  ఇందు విషయమై ప్రజారోగ్యమును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నియమ నిబందనల మేరకు నడుచుకొనవలసినదిగా తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...