విశాఖకు రైల్ పక్షి వలస
(స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం, పెన్ పవర్ మజ్జి శ్రీనివాస మూర్తి )
లాక్ డౌన్ వల్ల వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడంతో అరుదైన పక్షులు విశాఖ చేరుకుంటున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి కొండలపై కనిపించే అరుదైన రైల్ పక్షివిశాఖపట్నానికి వలస వస్తున్నాయి. ఇప్పటి వరకు తిరుపతి కొండలకే పరిమితమైన రైల్ పక్షులు నగరంలో కనిపిస్తున్నాయని.. శుక్రవారం పాండురంగాపురం వద్ద ఈ పక్షిని గుర్తించినట్లు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ కోస్టల్ ఎకో సిస్టమ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.చక్రవర్తి తెలిపారు. ఈ పక్షులు మరిన్ని విశాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు చక్రవర్తి పేర్కొన్నారు
No comments:
Post a Comment