Followers

.చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి





చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

పెన్ పవర్;కడప జిల్లా

 

జిల్లా లోని చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లి కార్జున అన్నారు, శుక్రవారం చేనేత ఐక్య వేదిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నందు చేనేత వ్రుత్తి పై ప్రత్యక్షంగా 2లక్షల కుటుంబాలు ,పరోక్షంగా ఒక లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు, కోవిడ్19 కరోనా వైరస్ వలన దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్ డౌన్ పాటిస్తున్నారు, చేనేత కుటీర పరిశ్రమ వ్యక్తుల సమూహం తో పని చేస్తారు అని ప్రభుత్వం నోటీసులు ఇచ్చి పని ఆపేయాలనీ చెప్పింది, దీని వలన లక్షల కుటుంబాలు పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, అలాగే చేనేత అనుబంధ వ్రుత్తులు అయిన నూలు వడికే వారికి లాక్ డౌన్ కారణంగా నూలు సరఫరా చేసే వాహనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మగ్గం మీద నేసిన వస్త్రాలు రవాణా వ్యవస్థ ఆగిన కారణంగా విక్రయించడానికి వీలు లేకుండా పోయింది, కాబట్టి చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వం కొని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, పని లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి చేనేత వ్రుత్తుల కుటుంబాలకు ఐదు వేల రూపాయల ను జీవన భ్రృతి కొరకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుచున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్  అవ్వారు మల్లి కార్జున మరియు ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు.

 


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...