ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఎమర్జెన్సీ పాసులు పొందాలి : జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా పోలీసుల నుంచి ఎమర్జెన్సీ పాసులు పొందాలని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అట్టాడ బాబూజీ అన్నారు. సోమవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రయాణాలకు వ్యక్తిగతంగా లేక వాహనంలో వెళ్లాలన్నా ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేవారు ఎమర్జెన్సీ టెంపరరీ పాసులు తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర వైద్యం రక్త సంబంధీకులు మరణిస్తే వ్యాపార నిమిత్తం స్వచ్ఛంద సేవకులు అత్యవసర సర్వీసులు గ్రామం విడిచి వెళ్లాలనుకుంటే ముందస్తుగా జిల్లా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగ పనులపై వెళ్లేవారు తప్పనిసరిగా ఉద్యోగ గుర్తింపు కార్డు తో ప్రయాణించవచ్చు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నకు దరఖాస్తు చేసుకోవాలన్నారు మీ పేరు ఆధార్ కార్డు నెంబర్ మీ పరిధిలో పోలీస్ స్టేషన్ క్యాంపు వెళ్లే వారి వివరాలు డ్రైవర్ పేరు లైసెన్స్ నంబరు వెహికల్ నెంబర్ ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం దారి గుండా వెళుతున్నారు వెళ్తున్నారు రోజులు పర్మిషన్ కావాలి తదితర విషయాల తో అప్లికేషన్ సెక్స్ వీడియోస్ జిల్లా అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వారు పరిశీలించి అవసరం నిజమని రుజువైతే పాస్ లను మీ వాట్సాప్ కు మీరు సూచించిన ఈ మెయిల్ ఐడీకి పంపిస్తారని ఆయన అన్నారు. విశాఖపట్నం జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9 5 0 52 00100 కి అప్లికేషన్ పంపించాలని ఆయన కోరారు. లేదా commandcontrolvspr@gmail.com.
No comments:
Post a Comment